బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘ధురంధర్’.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. అయితే, ఈ మూవీలో తండ్రీ కూతుర్లుగా నటించిన నటి సారా అర్జున్, సీనియర్ నటుడు రాకేశ్ బేడీ దురందర్ ఈవెంట్‌కు సంబంధించిన వేడుకలో కలుసుకున్నారు. అయితే, తనకంటే వయసులో చాలా చిన్నదైన సారా అర్జున్‌ను రాకేశ్ బేడీ ముద్దుపెట్టుకోవడం నెట్టింట పెద్ద దుమారం రేగింది. దీంతో భారీగా ట్రోల్స్ వచ్చాయి. ఈ క్రమంలో రాకేశ్ బేడీ స్పందించారు.
‘ధురంధర్’ సినిమాలో రాకేశ్, సారా కలిసి నటించడంతో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది . ఈ క్రమంలోనే జరిగిన ఆ మూవీ వేడుకలో వారిద్దరూ కలిశారు. సారా వేదిక పైకి రాగానే రాకేశ్ ఆమెకు ఎదురెళ్లి పలకరించే క్రమంలో ఆమె భుజంపై ముద్దు పెట్టారు. ఈ ఘటన గురించి ట్రోల్స్ రావడం చాలా బాధాకరం అంటూ రాకేశ్ బేడీ రియాక్ట్ అయ్యారు. దీనిని తప్పుగా అర్ధం చేసుకోవడం తెలివితక్కువ పని అంటూ ఫైర్ అయ్యారు.
సారా తనకంటే వయసులో చాలా చిన్నదని వివరణ ఇచ్చారు. మూవీ సెట్స్‌లో కూడా తామిద్దరం ఒకే కుటుంబంలానే ఉన్నామన్నారు. ఈ కారణంగానే ఆమె వేదికపై కనిపించగానే దగ్గరకు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కానీ, ఎక్కువమంది చెండాలంగా కథనాలు రాశారు. 20ఏళ్ల యువతిపై ముసలోడి ప్రేమ అంటూ రాశారు. కనీసం ఒక్కరు కూడా కుమార్తెపై ఉన్న ప్రేమ అనేలా రాయలేదని ఆవేదన చెందారు. సారా తనకు కూడా కూతురు లాంటిదేనని రాకేశ్ పేర్కొన్నారు.


