ఐబొమ్మ రవి వెనుక 'ప్రహ్లాద్‌'.. వెలుగులోకి కొత్త విషయం | Shocking Revelations In iBomma Ravi Case, Reveals New Names, Fake Identity, Foreign Citizenship, HD Movie Leaks | Sakshi
Sakshi News home page

iBomma Case Updates: ఐబొమ్మ రవి వెనుక 'ప్రహ్లాద్‌'.. వెలుగులోకి కొత్త విషయం

Dec 19 2025 7:55 AM | Updated on Dec 19 2025 9:14 AM

Ibomma Ravi behind Prahlad but he not reveal details

పైరసీ సినిమాల కేసులో ఐబొమ్మ నిర్వాహకుడు  రవిని మూడోసారి సైబర్‌క్రైమ్‌ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. 12రోజుల పాటు అతన్ని విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో చంచల్‌గూడ జైలులో ఉన్న రవిని పోలీసులు  కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో ఐబొమ్మ రవితో పాటు టచ్‌లో ఉన్న మరికొందరి పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హెచ్‌డీ సినిమాల్ని ఎలా పైరసీ చేస్తారనే విషయంపై పూర్తి సమాచారాన్ని ఇచ్చేశాడట.

తాజాగా జరిగిన విచారణలో ప్రసాద్‌, ప్రహ్లాద్‌ అనే ఇద్దరి పేర్లు రవి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో వారు కూడా కీలకంగా ఉన్నారని తేలింది. వీరిలో ప్రసాద్‌ మాత్రం రవికి పదో తరగతి స్నేహితుడని చెప్పాడట. అయితే, ప్రహ్లాద్‌ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదట. అయితే, ప్రహ్లాద్‌ పేరుతోనే  ఆధార్, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సును రవి తీసుకున్నాడు. కరీబియన్‌ దీవుల్లోని సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నేవిస్‌ దేశ పౌరసత్వం కూడా ప్రహ్లాద్‌ పేరుతోనే ఉంది. చివరకు ఐబొమ్మ వెబ్‌సైట్‌ కూడా ప్రహ్లాద​్‌ పేరుతోనే రిజిస్టర్‌ చేయించాడు.  కానీ, అతని గురించి మాత్రం ఎలాంటి వివరాలు రవి చెప్పడం లేదట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement