‘‘శంబాల’లో చాలా థీమ్స్ ఉంటాయి. డైరెక్టర్ యుగంధర్‌కి సౌండింగ్ మీద మంచి పరిజ్ఞానం ఉంది. నేను ఎన్నో థ్రిల్లర్ సినిమాలకు పని చేశాను. కానీ ‘శంబాల’ లాంటి సైంటిఫిక్, మైథలాజికల్ థ్రిల్లర్‌కు పని చేయడం కొత్తగా ఉంది’’ అని సంగీత దర్శకుడు శ్రీ చరణ్‌పాకాల చెప్పారు. ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది.
ఈ సినిమాకి సంగీతం అందించిన శ్రీ చరణ్‌పాకాల మాట్లాడుతూ– ‘‘నేను చిన్నప్పటి నుంచి మన మైథలాజికల్ స్టోరీస్ వింటూ పెరిగాను. ఆ జానర్‌లో రూపొందిన ‘శంబాల’కి మ్యూజిక్ ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈ కథలో భాగంగా వచ్చే నాలుగుపాటలు అద్భుతంగా ఉంటాయి. నేను ప్రతీ సినిమాకు ఒకేలా కష్టపడతాను. ఎంత టైమ్ అయినా తీసుకుంటాను కానీ, కాపీ మాత్రం కొట్టను. ఒకవేళ స్ఫూర్తిగా తీసుకున్నా అందులో నా శైలి ఉండేలా చూసుకుంటాను’’ అని చెప్పారు.


