breaking news
sricharan
-
World Music Day నాదమే జీవనం
కోయిల ఊరికే ఉండదు... పాడుతుంది. గాలి కూడా కామ్‌గా కూర్చోదు... సవ్వడి చేస్తుంది. వినాలే గానీ... కిటికీ పరదా చప్పుడు కూడా సంగీతమే! ఆనందమో, చిరు సంతోషమో కలిగినప్పుడు... ప్రతి గొంతూ కూని రాగం తీస్తుంది. సంగీతం లేకపోతే... ఈ జగతి ఉత్త శూన్యం. సప్త స్వరాలే... ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ‘వరల్డ్ మ్యూజిక్ డే’ సందర్భంగా ఒక పాటకో, ఒక గళానికో, ఒక స్వరానికో కృతజ్ఞత చెప్పుకోకపోతే ఎలా..? నాదమే జీవనంగా బతుకుతున్న నలుగుర్ని కలవకపోతే ఎలా..!ఊపిరి ఉన్నంతవరకూ పాటే నా ప్రపంచం– సంగీతదర్శకురాలు శ్రీలేఖ→ మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి రోజూ సంగీతాన్ని ఆస్వాదిస్తాను... ఆనందిస్తాను. ఊపిరి ఉన్నంతవరకు పాటలతో సెలబ్రేట్ చేసుకుంటాను. పాటే నా ప్రపంచం. సంగీతం తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. సంగీతాన్ని రోజూ ఇష్టపడుతున్నప్పటికీ ‘వరల్డ్ మ్యూజిక్ డే’ సందర్భంగా నాకు నచ్చిన పాటలను మరింత ఎక్కువగా వింటాను. నేను కంపోజ్ చేసిన పాటలను నెమరు వేసుకుంటాను... ఇలా చేసి ఉంటే బాగుండేది, అలా చేసి ఉంటే బాగుండేది... ఇలా రకరకాలుగా నా పాటలను విశ్లేషించుకుంటాను. → అప్పట్లో లైవ్ ఇన్స్ట్రూమెంట్స్ ఎక్కువగా ఉండేవి. ప్రొడ్యూసర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్లు ఎక్కువగా కోరుకునేవారు కూడా. పాటలు కూడా అలాగే ఉండేవి. రికార్డింగ్, సాంగ్ రికార్డింగ్‌లో నేను కూడా లైవ్ ఇన్స్ట్రూమెంట్స్ ఉపయోగించాను. వివిధ లైవ్ ఇన్స్ట్రూమెంట్లతో హాల్ మొత్తం సందడిగా, పండగ వాతావరణంతో ఉండేది. ప్రతిరోజూ ఒక పండగలా ఉండేది. ఎవరికి వారు బిజీ కావడం, లైవ్ ఇన్స్ట్రూమెంట్ రిక్వైర్డ్ సాంగ్స్ రాకపోవడం, డీజే టైప్ పాటలు, రెట్రో, హిప్ హాప్లాంటివి వచ్చి లైవ్ అవసరం లేకుండా పోయింది. ఒకవేళ అవసరం ఉన్నా ఎక్కడున్న వారు అక్కడ, ఎవరికి టైమ్ ఉన్నప్పుడు వారు పాడి, వాయించి పంపుతున్నారు. వాటిని తరువాత మిక్స్ చేస్తున్నారు. అంతా డిజిటలైజ్డ్ అయిపోయింది. ఇది ఎంతవరకు వెళుతుందో మాత్రం తెలియదు. → ఫుల్ ఆర్కెస్ట్రా ఉన్నప్పుడు సాంగ్ స్ట్రక్చర్ ఇలా రాబోతుందని తెలిసేది. ఎందుకంటే సింగర్స్‌తో సహా లైవ్ ఉండేది. స్ట్రక్చర్ గురించి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్‌కే తెలియడం లేదు. అక్కడొక ముక్క, ఇక్కడొక ముక్క, పల్లవి ఒకరు చేస్తారు... బీజియమ్ ఒకరు చేస్తారు. ఫైనల్ వచ్చే వరకు కూడా సాంగ్ ఎలా వస్తుంది? అనేది మ్యూజిక్ డైరెక్టర్‌కి తెలియడం లేదు. మార్పులు, చేర్పులు చేయాలంటే అదొక తతంగం. సో... సాంకేతిక అభివృద్ధి పరంగా మైనస్ ఉంది. కాకపోతే పని గంటలు తగ్గుతాయి. అలాంటి ప్లస్‌లూ ఉన్నాయి. → సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితోనూ బాగుంటాను. కోటిగారు, వందేమాతరం శ్రీనివాస్‌గారు, కీరవాణి అన్నయ్య, మణిశర్మగారు... ఇలా ఎంతోమంది చిన్నప్పటి నుంచి నన్ను చూసి ఉన్నారు కాబట్టి, అందరికీ నేను పెట్. అందరూ నన్ను అభిమానిస్తారు. → నా సినిమాల్లో నాకు సంతృప్తినిచ్చినవి చాలా ఉన్నాయి. ఉదాహరణకు ‘ధర్మచక్రం, తాజ్‌మహల్, ప్రేమించు, ప్రేయసి రావే, శివయ్య’ వంటివి. మొన్న వచ్చిన ‘హిట్–2’లో ‘ఉరికే ఉరికే’ సాంగ్ బ్లాక్ బస్టర్. నా కెరీర్లో ఎక్కువగా మంచి సినిమాలకు పని చేసే చాన్స్ రావడం నా అదృష్టం. → ఏఐ (కృత్రిమ మేధ) గురించి విన్నాను. ఎంత ఏఐ వాడినా, ఎలా చేసినా తెలిసిపోతుంది. హ్యూమన్ ఎమోషన్ ఏఐ ఇవ్వలేదు. మనిషి కంపోజ్ చేసి ఇచ్చినంత ఏఐ ఇవ్వలేదు. → సినిమా రంగంలో రావడానికి నేను వచ్చిన టైమే కష్టం అనుకుంటే ఇప్పుడు మరింత కష్టం అయింది. ఎంతోమంది డైరెక్టర్స్, సింగర్స్, కంపోజర్స్ వస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బాగా కష్టపడాలి. ఇక మనం ఏ స్థాయికి వెళతామనేది అది మన అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. → నేను సినిమా ఒప్పుకోవడానికి మూడు విషయాల గురించి ఆలోచిస్తాను. మొదటిది కథ. జనరల్‌గా కథే కదా హీరో. కథ ఎలా ఉంది, ఏ జానర్లో ఉంది, డైరెక్టర్ ఫ్యాషనేట్‌గా తీయగలరా? ప్రాపర్‌గా రిలీజ్ చేయగలరా? వీటి గురించి ఆలోచిస్తాను. → మహిళలు, పురుషులు అని కాదు... సినిమా ఫీల్డ్‌లోకి రావాలంటే ఎవరికైనా అది అంత తేలికైన విషయం కాదు. కమర్షియల్ ఫీల్డ్ కాబట్టి ఇంట్లో అందరినీ ఒప్పించాలి, చాలా టాస్క్‌లు ఉంటాయి. దేవుడి దయ వల్ల ఆ టాస్క్‌లన్నీ దాటుకొని ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాను.– డి.జి. భవానిమనసుని తాకాలంటేమెలోడీ బెస్ట్– సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్→ ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జూన్ 21న వరల్డ్ వైడ్‌గా జరుపుకుంటారు. మనకు కూడా ఇక్కడ మ్యూజిక్ డే సెలబ్రేషన్స్‌ని చేస్తుంటారు. కానీ, నాకైతే ప్రతి రోజూ సంగీత దినోత్సవమే. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకూ సంగీతంతోనే ఉంటాను కాబట్టి. → సంగీతంలో అప్పటికీ, ఇప్పటికీ టెక్నాలజీ వైజ్, వర్కింగ్ వైజ్ చాలా మార్పులొచ్చాయి. మ్యూజిక్ ఎప్పుడూ మెలోడీ వైజ్ మెలోడీనే ఉంటుంది... దాన్ని ఏదీ రీ ప్లేస్ చేయలేదు. గతంలో లైవ్‌లో అందరం ఒకేసారి రికార్డ్ చేసేవాళ్లం. ఇప్పుడు బిట్ బిట్‌గా, సిస్టమ్ ద్వారా చేస్తున్నాం. ఒక పదం పదం పరంగా కూడా రికార్డింగ్ చేస్తున్నాం. అలాగే ఏఐ ద్వారా వాయిస్ మాడ్యులేషన్స్‌లో కూడా మార్పులొస్తున్నాయి. → సాంకేతికంగా ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి. దానికి తగ్గట్టుగానే పని చేయాల్సి ఉంటుంది. అయితే ముందు రోజుల్లో లైవ్ రికార్డింగ్స్ ఉన్నప్పుడు ఒకటేసారి మొత్తం ఆర్కెస్ట్రా, సింగర్స్ అంతా కలిసి ఒక టేక్‌లో అయిపోయేది. అది ఒక రకంగా సులభంగా ఉండేది. ఎందుకంటే... గతంలో ఫ్లూట్ బిట్, వీణ బిట్, తబలా బిట్ ఇది... అని ఒక ప్రాపర్‌గా సెట్ చేసుకుని కంపోజ్ చేసేవారు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా ఆప్షన్స్ వచ్చాయి. ఒక్కొక్క ట్యూన్ సెలక్షన్స్‌కే చాలా రోజులు పట్టేస్తోంది. అంటే ఎక్కువ ట్యూన్స్ ఎంచుకునే అవకాశం ఉండటంతో ఇంకా ఏదో మంచిది దొరుకుతుంది, ఇంకా కొత్త ట్యూన్ దొరుకుతుంది అని. ఈ ప్రాసెస్ కొంచెం కాంప్లికేటెడ్. అయితే ఈ టెక్నాలజీ పరంగా సౌలభ్యం ఏంటంటే టైమింగ్స్. సింగర్ లేదా మ్యుజిషియన్ టైమ్‌కి అందుబాటులో లేకున్నా, ఇతర దేశంలో ఉన్నా వారు పాడటం లేదా వాయించి పంపితే మేము ఇక్కడ యాడ్ చేస్తాం. ఒక రకంగా ఇది అడ్వాంటేజ్. → ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్‌కి ఒక్కో శైలి ఉంటుంది. నా పరంగా వచ్చేసరికి నేనెప్పుడూ మెలోడీని ప్రేమిస్తాను. ఏ పాట కంపోజ్ చేసినా కూడా మెలోడీకి తొలి ప్రాధాన్యం ఇస్తాను. ఎందుకంటే మనకు సంగీతం అనగానే మొదట టచ్ అయ్యేది మనసు. మెలోడీయే మనకు ఎక్కువ రోజులు గుర్తుంటుందని బలంగా నమ్ముతాను. నా తొలి ప్రాధాన్యం ఎప్పుడూ మెలోడీయే. కానీ, కథ, సందర్భం, అవసరాన్ని బట్టి అక్కడ మాస్ సాంగ్ లేదా బీట్ సాంగ్ ఇస్తుంటాను. → ఇప్పుడొస్తున్న యువ సంగీత దర్శకులు చాలా బాగా పని చేస్తున్నారు. అయితే ఆరోగ్యకరమైన పోటీ అనేది చాలా అవసరం. ఎందుకంటే.. ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వైవిధ్యమైన స్టైల్స్, ఫీల్స్ వినడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా మనం ఏదో చేయాలి? అనే ఉత్సాహం ఉండాలి. అయితే పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి. → నా కెరీర్లో దాదాపు 90 సినిమాలు చేశాను. అయితే ఓ సంతృప్తి అనేది సినిమా విజయం వల్ల ఉంటుంది... కథ వల్ల ఉంటుంది. ఆ స్టోరీ జనాల్లోకి బాగా వెళ్లడం, మన పాటలు బాగా హిట్ అయితే అదో సంతృప్తి ఉంటుంది. నా సినిమాల్లో అలా సంతృప్తి ఇచ్చినవాటిలో ‘ప్రేమకావాలి, మనం, ఇష్క్, గోపాల గోపాల, టెంపర్’ వంటివి చాలా ఉన్నాయి. → ప్రస్తుతం కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న సంగీత దర్శకులు, సింగర్స్‌లో చాలా మంచి ప్రతిభ ఉంది. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా పరిధి బాగా పెరిగింది. దాని వల్ల స్టార్ వేల్యూ, పాపులారిటీ అన్నది గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా సులభం అయింది. అయితే కొత్తవాళ్లకు అంకితభావం... ప్రధానంగా ఓపిక అనేది ఉండాలి. అప్పుడే మన లక్ష్యం అనేది చేరుకుంటాం. ప్రతి ఒక్కరికి ఒక్కో టైమ్ ఉంటుంది... మన సమయం వచ్చినప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం. → ప్రస్తుతం ‘వారాహి’ అనే సినిమా చేస్తున్నాను. అలాగే తేజగారి చిత్రంతో పాటు అర్జున్‌గారి సినిమా చేస్తున్నాను. మరో ఐదారు సినిమాలు కూడా ఒప్పుకున్నాను.→ నేను చిన్నప్పటి నుంచి ఇళయరాజా సార్, ఏఆర్ రెహమాన్ సార్ పాటలు వింటూ పెరిగాను. వాళ్ల వర్కింగ్ స్టైల్, లైఫ్ స్టైల్.. చె΄్పాలంటే వాళ్లే నాకు స్ఫూర్తి. నాకే కాదు ఇప్పుడు కొత్తగా వచ్చే చాలా మంది సంగీత దర్శకులకు, అలాగే ఇప్పుడు ఉన్న వారికి కూడా. నేను మాత్రం ఆర్డీ బర్మన్‌గారు, ఇళయరాజా సార్, ఏఆర్ రెహమాన్‌గారు.. వాళ్ల వద్ద నుంచి చాలా నేర్చుకున్నాను.→ సినిమా ఒప్పుకోవాలంటే నా తొలి ప్రాధాన్యత కథే. అయితే కొన్నిసార్లు బ్యానర్, హీరో, డైరెక్టర్ వేల్యూ కూడా ఉంటాయి. అయితే ఎవరైనా కొత్తవాళ్లు, కొత్త ప్రొడక్షన్ హౌస్ వాళ్లు నన్ను కలిస్తే మాత్రం ముందు కథ విని, నచ్చితే ఒప్పుకుంటాను.– డేరంగుల జగన్ మోహన్లైవ్ రికార్డింగ్లోడెప్త్ ఉంటుంది – సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల→ సంగీత దర్శకుడిగా ప్రతిరోజునీ నా ఫస్ట్ డే మ్యూజిక్ డైరెక్షన్లానే భావిస్తాను. ప్రతిరోజూ ఓ స్ట్రగులే. అందుకే అప్‌గ్రేడ్ అవుతుంటాను. ప్రజలు ఎలాంటి సంగీతాన్ని ఇష్టపడుతున్నారో తెలుసుకుని, కొత్త తరహా సంగీతాన్నందించాలన్నదే నా తపన. → మనం ఆనందంలో ఉన్నప్పుడు పాట వింటాము. దుఃఖంగా ఉన్నప్పుడూ పాట వింటాము. మన భావాలను పంచుకోవాలనుకున్నప్పుడు మ్యూజిక్‌తో తెలియజేస్తాం. ఇలా పలు రకాలుగా సంగీతం అనేది మన జీవితంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. → దశాబ్ద కాలానికి పైగా సంగీతరంగంలో రాణిస్తున్నాను. ఈ రంగంలో టెక్నాలజీ అప్డేట్ అవుతూ వస్తోంది. టెక్నాలజీని మనం ఎంత వరకు కరెక్ట్‌గా వాడాం అన్నది జాగ్రత్తగా గమనించుకుంటుంటే అడ్వాంటేజ్‌గానే ఉంటుంది. కొన్నిసార్లు డిస్అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒరిజినాలిటీ అనేది ఎప్పుడూ మిస్ కాకూడదు. మ్యూజిక్ అనేది హ్యూమన్ టచ్‌తో సంబంధం ఉన్న అంశం. అలాగే సంగీత దర్శకులకు ఏఐ ఉపయోగపడుతుంది. కానీ మనం దాన్ని ఎంతవరకు వినియోగిస్తున్నాం అన్నది చూసుకోవాలి. → ఇండస్ట్రీలో ఉన్న పోటీతత్వాన్ని గమనిస్తుంటాను. ఫస్ట్ నాకు నేను పోటీగా ఉండాలనుకుంటాను. ఎంతమంది ఉన్నా కూడా మనకు మనం పోటీగా ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్లగలం. ఇండస్ట్రీలో సంగీతదర్శకుల మధ్య ఉండే పోటీని చూసి ఉలిక్కిపడను. నేను ఎదగడానికి ఏం చేయాలి అని చూస్తాను తప్ప పక్కన ఇంకెవరో వచ్చారని కంగారు పడను. → డిజిటల్ సాయంతో మ్యూజిక్ చేయడం కొంతవరకు సౌకర్యంగానే ఉంటుంది. కానీ లైవ్ రికార్డింగ్స్ అనేవి మాత్రం డెప్త్ క్రియేట్ చేస్తాయి. ఎంత చెప్పినా లైవ్ లైవే... దాంట్లో తిరుగులేదు. నేను గిటారిస్ట్‌ని. లైవ్ అంటే ఏంటో నాకు తెలుసు. ఎంత టెక్నాలజీ వాడినా కూడా లైవ్ అన్నది లైవే. డిజిటలైజ్ వల్ల పని సులభం అవ్వొచ్చు. కానీ లైవ్ రికార్డింగ్ అనేది మ్యూజిక్‌ను నిలబెడుతుంది. → శ్రోతలకు లిరిక్స్ వినిపించేలా మనం సంగీతం ఇవ్వాలి. ఆ పాటకు లిరిక్స్ చాలా ముఖ్యమని, లిరిక్దే ప్రథమ స్థానమని భావిస్తాను. నా సినిమాల్లోని పాటల్లో లిరిక్స్ ఆడియన్స్‌కు వినిపించాలనే ప్రయత్నిస్తుంటాను. లిరిక్స్ ఆడియన్స్‌కు అర్థమైతే, అప్పుడు ఆ లిరిక్కు మ్యూజిక్ డైరెక్టర్ ఈ తరహా మ్యూజిక్ ఇచ్చాడని వారికి అర్థమౌతుంది. అదే లిరిక్ అర్థం కాకుండా మనం మ్యూజిక్ ఇస్తే ఎందుకు లిరిక్ అర్థం కావడం లేదనిపిస్తుంది. లిరిక్ అర్థమైనప్పుడే సినిమాలోని సందర్భం మ్యూజిక్‌తో ఆడియన్స్‌కు మరింత చేరువ అవుతుంది. → సినిమాలో సౌండ్ అనేది డిజైన్ చేసినప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే మంచిది. ఒక సినిమాకు ఇద్దరు... ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేసే విధానానికి నేను వ్యతిరేకిని. ఇది నా సొంత అభి్రపాయం. అయితే కొన్నిసార్లు ఒక సినిమాకు ఇద్దరు... ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేసినప్పుడు అది వర్కౌట్ అయ్యింది. అలాంటప్పుడు ఒక సినిమాకు ఒకే సంగీత దర్శకుడు పని చేయాలని చెప్పడానికి నేనెవర్ని. కానీ... చేస్తే మొత్తం సినిమా చేయాలని నేను కోరుకుంటాను. ఈ విషయంపై నా స్టాండ్ ఏంటంటే... నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు. కానీ సంగీత దర్శకుల్లో నేను ఒక భాగమే. ఎవరైనా వచ్చి, ఫలానా సినిమాలో ఒకే ఒక్క సాంగ్ చేయమన్నా చేస్తాను. → మ్యూజిక్ రంగంలో స్థిరపడాలనుకునే కొత్త తరం వారికి నేను చెప్పేది ఒక్కటే. ఒక్కసారి డిసైడ్ అయితే వెనక్కి తిరిగి చూడొద్దు. నిత్యం కష్టపడాలి. ఫోకస్‌గా ఉండాలి. ప్రతిక్షణం మ్యూజిక్ పైనే ఫోకస్ పెట్టి పని చేయాలని చెబుతాను. → వరల్డ్ మ్యూజిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటాను. ఈ సందర్భంగా నా సహచర మ్యూజిషియన్స్ అందరికీ విషెస్ చెబుతున్నాను. అందరికీ అవకాశాలు రావాలని, అందరూ సక్సెస్ కావాలని, అందరూ ఎదగాలని కోరుకుంటాను. ప్రస్తుతం అడివి శేష్గారి ‘గూఢచారి 2, ఆది సాయికుమార్‌గారి ‘శంబాల’ సినిమాలు చేస్తున్నాను. మరో ఆరు సినిమాలు లైనప్‌లో ఉన్నాయి.→ నేను సినిమా ఒప్పుకోవాలంటే కథను మాత్రమే చూస్తాను. అలాగే నేను ఉపయోగించే ఇన్స్ట్రూమెంట్స్ సినిమా టు సినిమా మారిపోతుంటాయి. కథ, ఆ సినిమా హీరో, ఆ హీరో బాడి లాంగ్వేజ్‌ని బట్టి ఎలాంటి స్టైల్ క్రియేట్ చేయవచ్చు. డైరెక్టర్ ఏ విధమైన మ్యూజిక్ ఆశిస్తున్నారు. ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ట్యూన్స్ చేస్తాను. ∙‘మేజర్, నాంది, గూఢచారి, కృష్ణ అండ్ హిజ్ లీలా, డీజే టిల్లు’ వంటి చిత్రాలు ఓ సంగీతదర్శకుడిగా నా కెరీర్లో ఎక్కువ సంతృప్తినిచ్చాయి. – ముసిమి శివాంజనేయులు -
ఆ ఇమేజ్ ఇబ్బందిగానే ఉంది: సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల
కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సత్యభామ’. ఓ కీలక పాత్రలో నవీన్‌చంద్ర నటించారు. సుమన్ చిక్కాల దర్శకత్వంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం విలేకర్ల సమావేశంలో ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ– ‘‘ఓ పోలీసాఫీసర్ ఎమోషనల్ జర్నీయే ఈ చిత్రం.థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి ‘సత్యభామ’ చిత్రం బాగా నచ్చుతుంది. ఈ సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. కాజల్, నవీన్‌చంద్రల మధ్య ‘కళ్లారా చూసాలే..’ అనే లవ్‌సాంగ్ ఉంటుంది. అలాగే ‘వెతుకు వెతుకు’ పాట ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఉంటుంది. ఈ పాటను కీరవాణిగారు పాడారు. గతంలో ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ సినిమాకు నా మ్యూజిక్‌లో కీరవాణిగారు పాడారు. ‘సత్యభామ‘ పాటకు ఆయన స్టూడియోకు వస్తూనే ‘నేను పాడిన ఏ పాట విని నన్ను నీ పాటకు పాడేందుకు పిలిచావ్’ అని అడిగారు. లిరిక్స్ అందించిన చంద్రబోస్‌గారు కూడా పాట పూర్తయ్యేంతవరకు చర్చిస్తూనే ఉన్నారు.‘సత్యభామ’లో ఓ ఇంగ్లిష్ సాంగ్ కూడా ఉంది. ఇతర పాటలను త్వరలోనే విడుదల చేస్తాం. నేను థ్రిల్లర్ మూవీస్‌కు ఎక్కువగా పని చేస్తాననే పేరొచ్చింది. ఈ ఇమేజ్ నాకు ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే మొత్తం థ్రిల్లర్ మూవీస్‌కు నేనే సంగీతం అందించడం లేదు. చెప్పాలంటే.. ‘కృష్ణ అండ్ హిస్ లీల, డీజే టిల్లు, గుంటూరు టాకీస్’ వంటి లవ్ అండ్ కమర్షియల్ చిత్రాలకూ సంగీతం అందించాను. కానీ థ్రిల్లర్స్ మ్యూజిక్ డైరెక్టర్ అనే ముద్ర వచ్చేసింది. నాకైతే అన్ని జానర్ సినిమాలకూ సంగీతం అందించాలని ఉంది. ప్రస్తుతం ‘గూఢచారి 2’కు పని చేస్తున్నాను. మరో నాలుగైదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు. -
ఎన్నికల ఫలితాలపై ఉష శ్రీ చరణ్ కీలక వ్యాఖ్యలు
-
అలా జడ్జ్ చేయడం బాధగా ఉంది
‘‘మంచి మ్యూజిక్ ఇవ్వడానికి ఖరీదైన మ్యూజిక్ పరికరాలు అవసరం లేదు. ‘క్షణం’, ‘మేజర్’లో కొన్ని సీన్లకు మేం ఫోన్లో రికార్డ్ చేసిన వాయిస్‌నే వాడాం. ఇక ఇప్పుడు యూ ట్యూబ్ వ్యూస్, ఇన్‌స్టా రీల్ వ్యూస్‌తో మ్యూజిక్ డైరెక్టర్స్‌ను జడ్జ్ చేయడం కాస్త బాధగా ఉంది. అందుకే ఇప్పుడు నేను సినిమాలు తగ్గించుకున్నాను. ఇండిపెండెంట్ మ్యూజిక్, ఆల్బమ్స్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నాను’’ అని అన్నారు సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల. రోషన్ కనకాల, మానస జంటగా రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రూ΄÷ందిన సినిమా ‘బబుల్గమ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ– ‘‘గడిచిన పదేళ్లలో నేను చేయాల్సింది చేశాను. ఇక నన్ను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ‘బబుల్గమ్’తో ఈ ప్రయత్నం మొదలైంది. ఈ సినిమాలో హీరోది డీజే రోల్. నా ఫ్రెండ్స్‌లో ఎక్కువమంది డీజేలు ఉండటంవల్ల ఎలక్ట్రానిక్ మ్యూజిక్‌పై అవగాహన ఉంది. ట్యూన్ కంటే లిరిక్స్ ముఖ్యమని నమ్ముతాను. ‘బబుల్గమ్’ చూశాను. రోషన్ మంచి నటుడు, డ్యాన్సర్. డబ్బింగ్ కూడా బాగా చెప్పాడు. ప్రస్తుతం ‘సత్యభామ’, ‘గూఢచారి 2’ సినిమాలకు సంగీతం అందిస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘ప్రతి రంగంలోనూ సాంకేతిక విప్లవం వచ్చింది. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్ల మ్యూజిక్ కం΄ోజర్స్కు ప్రమాదం ఉండొచ్చు. కానీ ‘ఏఐ’ని అప్లై చేయడానికీ హ్యూమన్ టచ్ కావాలి. సప్తస్వరాలు ఏడే. సౌండింగ్ ఎలా ఇస్తున్నామన్నదే ముఖ్యం. ‘గూఢచారి’ వల్ల కాదు.. ‘కృష్ణ అండ్ హీజ్ లీల’ సినిమాలోని మ్యూజిక్ నచ్చి నాకు చాన్స్‌లు ఇచ్చినట్లుగా కొందరు నాతో చెప్పారు. నాకదో హ్యాపీ సర్ప్రైజ్’’ అని చెప్పుకొచ్చారు. -
నా కల నేరవేరింది: శ్రీ చరణ్ పాకాల
‘‘ఓ మ్యూజిక్ డైరెక్టర్‌గా నా కెరీర్లో ఇంత తొందరగా ఓ బయోపిక్కు పని చేస్తానని నేను అనుకోలేదు. ‘మేజర్’కి సంగీతం అందించడంతో నా కలల్లో ఒక కల నిజమైనట్లుగా భావిస్తున్నా’’ అన్నారు శ్రీ చరణ్ పాకాల. అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్’. ఈ చిత్రంలో సందీప్‌గా అడివి శేష్ నటించారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్గా, శోభితా ధూళిపాళ్ల కీలక పాత్రలో కనిపిస్తారు. మహేశ్‌బాబు జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌లతో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ – ‘‘అడివి శేష్ దర్శకత్వంలో వచ్చిన ‘కిస్’ మ్యూజిక్ డైరెక్టర్‌గా నా తొలి సినిమా. ఆ తర్వాత ‘క్షణం, గూఢచారి, ఎవరు’ చిత్రాలు చేశాను. థ్రిల్లింగ్, యాక్షన్, ఎమోషన్, లవ్‌స్టోరీ.. ఇలా అన్ని అంశాలు ‘మేజర్’లో ఉన్నాయి. 26/11 దాడుల గురించి నాకు అవగాహన ఉంది. బయోపిక్ కావడంతో జాగ్రత్తగా మ్యూజిక్ కంపోజ్ చేశాను. ఈ చిత్రంలో నాలుగు పాటలు ఉన్నాయి. అన్నీ డిఫరెంట్. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడంలో కిక్ ఉంటుంది. ‘ఇట్లు... మారేడుమిల్లి ప్రజానీకం’, ‘క్షణం’, ‘గూఢచారి 2’, ‘తెలిసినవాళ్ళు’, కన్నడ ‘ఎవరు’ రీమేక్, దర్శకుడు విజయ్ కనకమేడల సినిమా.. ఇలా ఆరేడు చిత్రాలకు సంగీతం అందిస్తున్నాను’’ అన్నారు. చదవండి 👇 బిగ్‌బాస్ షో ద్వారా బిందు ఎంత వెనకేసిందంటే? పుష్ప మూవీ సమంత వల్లే హిట్ అయ్యింది -
వాట్సాప్ మెసేజ్: సారీ డాడీ.. ఎలా చెప్పాలో తెలియట్లేదు..
స్టేషన్‌ఘన్‌పూర్: ఎక్కువ సమయం సెల్ఫోన్లో వీడియో గేమ్స్ ఆడొద్దని తండ్రి మందలించాడని ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నా డు. అంతకు ముందు ‘సారీ.. డాడీ’ అంటూ తండ్రి కి వాట్సాప్ సందేశం పంపాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం ఉప్పుగల్లుకు చెందిన కోరు కొప్పుల రాజు, అనిత దంపతుల కుమారుడు శ్రీచరణ్‌గౌడ్ పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. లాక్డౌన్ కారణంగా ఇంటి వద్దే ఉంటున్న శ్రీచరణ్ ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతుండటంతో తండ్రి ఆదివారం మందలించాడు. మనస్తాపానికి గురైన శ్రీచరణ్ ఆదివారం రాత్రి భోజనం చేశాక కుటుంబసభ్యులు నిద్రపోయే వరకు ఉండి, రాత్రి 11 గంటలకు బైక్‌పై స్టేషన్‌ఘన్‌పూర్ వెళ్లాడు. 12.54 గంటలకు తండ్రి ఫోన్‌కు ‘ఐయామ్ వెరీ సారీ డాడీ.. అమ్మ, చెల్లెను బాగా చూసుకో’అని వాట్సాప్ మెస్సేజ్ పంపాడు. రాత్రి 1.10 గంటలకు ‘ఐయామ్ వెరీవెరీ సారీ డాడీ.. నా సమస్యను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. డాడీ, మమ్మీ, చెల్లి మేఘీ ఐ మిస్ యూ’అంటూ మరోసారి మెసేజ్ పంపాడు. రాత్రి 1.15 గంటలకు రైల్వేస్టేషన్ లొకేషన్ షేర్ చేశాడు. నిద్రలో ఉండటంతో ఎవరూ చూడలేదు. రాత్రి 1.20 గంటలకు ఘన్పూర్ రైల్వే స్టేషన్లో దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం సెల్లో మెస్సేజ్‌లు చూసిన రాజు హుటాహుటిన ఘన్‌పూర్‌కు వెళ్లే సరికి కుమారుడి తల, మొండెం విడిపోయి విగతజీవుడై పడి ఉండటంతో బోరున విలపించాడు. (చదవండి: రేఖ హత్య: సూత్రధారి మాలా.. ఎన్నికల కోసమేనా?!) -
స్నేహితుడిని కాపాడమంటూ సంగీత దర్శకుడి అభ్యర్థన
టాలీవుడ్ సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన స్నేహితుడిని కాపాడమంటూ సినీప్రముఖులను అభ్యర్థిస్తున్నాడు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ట్వీట్ చేశాడు. 'ఫొటోగ్రాఫర్‌గా ఎదుగుతున్న నా స్నేహితుడు జీవన్ కిశోర్ వర్మ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని రక్షించేందుకు సాయం చేయండి. నేను నా వంతు సాయం అందించాను. దయచేసి మీరు కూడా మీ వంతు కృషి చేయండి' అంటూ తన స్నేహితులు సత్యదేవ్, అడివి శేష్, కోనవెంకట్‌ను వేడుకున్నాడు. దీనిపై సత్యదేవ్ స్పందిస్తూ తన వంతు సాయం చేశాను అని రిప్లై ఇచ్చాడు. కాగా జీవన్ వైద్యానికి సుమారు 10 లక్షల రూపాయల వరకు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా వారికి తోచిన సాయం అందిస్తున్నారు. కాగా శ్రీచరణ్ పాకాల 'కిస్' సినిమాతో తన కెరీర్‌ను ఆరంభించినప్పటికీ 'క్షణం' చిత్రంతో పేరు సంపాదించుకున్నాడు. 'పీఎస్వీ గరుడ వేగ', 'గూఢచారి', 'అశ్వత్థామ', 'నాంది' చిత్రాలు అతడికి మరింత పాపులారిటీ తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం అతడు 'మేజర్'తో పాటు 'తిమ్మరుసు' సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. A friend of mine who is a budding photographer met with an accident and fighting for Life. We need a helping hand to save his life. I've done my part. Request you to spread the word @ActorSatyaDev @vamsikaka @AdiviSesh @konavenkat99https://t.co/cfJUltnJFF — Sricharan Pakala (@SricharanPakala) June 6, 2021 చదవండి: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ అంజలి -
క్యాట్ - 2016లో మెరిసిన ప్రకాశం జిల్లా వాసి
మార్కాపురం: క్యాట్-2016 ప్రవేశ పరీక్షలో ప్రకాశం జిల్లా వాసి మెరిశాడు. మార్కాపురానికి చెందిన గొంట్లా వెంకట శ్రీచరణ్ 99.1 శాతం మార్కులను సాధించాడు. క్యాట్ 2015 ప్రవేశ పరీక్షల్లో శ్రీచరణ్‌కు 97.3 శాతం మార్కులు రాగా కళాశాలలో సీటు రాలేదు. దీంతో 2016 అర్హత పరీక్షలు రాయగా 99.1 శాతం మార్కులు వచ్చాయని అతని తండ్రి రాంబాబు తెలిపారు. శ్రీచరణ్ గౌహతిలో ఐఐటీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఒరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పారు. -
శ్రీచరణ్, ప్రత్యూష్ శతకాలు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యూష్ కుమార్ (125), శ్రీచరణ్ (102 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో ఎ-డివిజన్ వన్డే లీగ్ చాంపియన్‌షిప్‌లో గ్రీన్‌ల్యాండ్స్ జట్టు 155 పరుగుల భారీ తేడాతో నోబుల్ టీమ్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గ్రీన్‌ల్యాండ్స్ వికెట్ నష్టానికి 253 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నోబుల్ 98 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్‌లో రాణించిన శ్రీచరణ్ బౌలింగ్‌లోనూ 24 పరుగులకు 4 వికెట్లు తీశాడు. ఇతర మ్యాచ్‌ల స్కోరు వివరాలు ఎస్కే బ్లూస్: 239/9; హసన్ 94, సుమన్ 39, ఇంద్రనీల్ 3/42); ఏబీ కాలనీ: 184/9 (సతీష్ 77, అశ్విన్ 4/33). డెక్కన్ కోల్ట్స్: 202/3 (సంతోష్ 89, ప్రతీక్ 59); యాదవ్ డెయిరీ: 206/5 (పురుషోత్తమ్ నాయక్ 35, అభిషేక్ 58, సూర్యతేజ 61). ఎ-డివిజన్ త్రీడే లీగ్ స్కోరు వివరాలు ఎర్నాకులమ్: 208/4 (అభిషేక్ 37, చైతన్య 90); ఎవర్గ్రీన్తో మ్యాచ్