మహిళల క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు | YS jagan Congratulates Indian Women Cricket Team For Win | Sakshi
Sakshi News home page

మహిళల క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

Nov 3 2025 7:52 AM | Updated on Nov 3 2025 8:32 AM

YS jagan Congratulates Indian Women Cricket Team For Win

సాక్షి, తాడేపల్లి: వరల్డ్ కప్‌లో మహిళా క్రికెట్ టీమ్ విజయం సాధించటంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. ఈ అద్భుతమైన విజయం భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందన్నారు. కడప అమ్మాయి శ్రీచరణి ఛాంపియన్ జట్టులో భాగం కావడం విశేషం అని అన్నారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్‌ వేదికగా..‘భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టీంవర్క్, వారి ఆత్మవిశ్వాసం దేశాన్ని గర్వపడేలా చేసింది. వరల్డ్‌కప్‌ను అందుకుంది. కడప అమ్మాయి శ్రీచరణి ఛాంపియన్ జట్టులో భాగం కావడం విశేషం. ఈ అద్భుతమైన విజయం భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం. ఈ గెలుపు ప్రతి  భారతీయుడు పెద్ద కలలు కనడానికి ఒక ప్రేరణ’ అని అభినందనలు తెలిపారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement