బెంగళూరు : మనుషుల్లో అంతకంతకూ వివేచన, విచక్షణ జ్ఞానం అనేది అంతకంతకూ నశించిపోతోంది. స్వల్ప వివాదానికే ఆవేశంతో ఊగిపోతున్నారు. చివరకు హత్యలకు కూడా తెగబడుతున్నారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఒక హత్యోందంతం దిగ్భ్రాంతి రేపక మానదు.
ఆఫీసులో లైట్లు ఆర్పే విషయంలో ఏర్పడిన చిన్న తగాదా హత్యకు దారి తీసింది. చిత్రదుర్గకు చెందిన భీమేష్ బాబు అనే 41 ఏళ్ల మేనేజర్‌ను అతని సహోద్యోగి డంబెల్‌తో కొట్టి చంపాడు. శనివారం తెల్లవారుజామున గోవిందరాజనగర్ పోలీస్ పరిధిలోని డేటా డిజిటల్ బ్యాంక్ కార్యాలయంలో తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో, విజయవాడకు చెందిన టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ సోమల వంశీ (24)ని లైట్లు ఆర్పేయమని తన మేనేజర్ భీమేష్‌ను కోరాడు. లైట్లు, వెలుగులు పడని వంశీ అవసరం లేనప్పుడు వాటిని ఆఫ్ చేయమని సహోద్యోగులను తరచుగా కోరుతూ ఉంటాడట. అదే విధంగా భీమేష్‌ను కూడా లైటు ఆఫ్ చేయమని కోరాడు. భీమేష్ వినకపోవడంతో అది వాగ్వాదానికి తీసింది. కోపంతో ఊగిపోయిన వంశీ బాబుపై కారం పొడి విసిరి, తల, ముఖం, ఛాతీపై డంబెల్‌తో పదేపదే కొట్టడంతో అతను కుప్పకూలి పోయాడు. ఆ తరువాత వంశీ భయాందోళనకు గురై ఇతర ఉద్యోగుల సహాయం కోరాడు. అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. కానీ బాబు అక్కడికక్కడే మరణించాడు.
చదవండి: నీతా అంబానీకి స్టాఫ్ సర్‌ప్రైజ్ : భర్త, తల్లి కాళ్లు మొక్కి బర్త్‌డే సెలబ్రేషన్స్ చూశారా?
ఆ తరువాత వంశీ స్వయంగా గోవిందరాజనగర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. హత్య కేసు నమోదు చేయబడింది. ఆఫీసు లైట్లు వెలిగించాలనే వివాదం హత్యకు దారితీసిందని డిసిపి (వెస్ట్) గిరీష్ ఎస్ ధృవీకరించారు.


