న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోషల్ మీడియాలో తన హవాను చాటుకున్నారు. ఎక్స్ (ట్విటర్)లో ట్వీట్లతో టాప్‌లో నిలిచారు. ఎక్స్ లాంచ్ చేసిన కొత్త ఫీచర్ మోస్ట్ లైక్‌డ్ ప్రకారం ఆయన ట్వీట్లు ఇండియాలో ఎక్కువ లైక్స్ సాధించిన ట్వీట్ల జాబితాలో నిలిచాయి. దేశాల వారీగా ఫీచర్ ప్రధాని గత నెలలో భారతదేశంలో అత్యధికంగా లైక్ చేయబడిన పది ట్వీట్లలో ఎనిమిదింటిని కైవసం చేసుకున్నారు. మరే పొలిటికల్ నేత పేరు ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం.
గత 30 రోజుల్లో వ్యక్తిగత దేశాలలో అత్యధికంగా లైక్ చేయబడిన ట్వీట్‌లను హైలైట్ చేసే కొత్త ఫీచర్‌ను ఎక్స్ తాజాగా విడుదల చేసింది. ఈ ఫీచర్ ద్వారా వెలువడిన డేటా ప్రకారం, నరేంద్ర మోదీ హైయ్యస్ట్ ఎంగేజ్‌మెంట్ కంటెంట్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా అత్యధికంగా లైక్ చేయబడిన టాప్ పది ట్వీట్‌లలో ఎనిమిదింటిలో పీఎం మోదీ కావడం విశేషం. టాప్ టెన్‌లో మరే ఇతర రాజకీయనాయకుడు లేడు. మిగిలిన రెండు స్థానాల్లో రాజకీయేతర ఖాతాలున్నాయి.
The Like Button Has a Clear Favourite
A significant moment in India’s digital journey, as X’s new 'Most-Liked' feature highlights content shared by PM @narendramodi among the nation’s most-liked posts, reflecting strong public engagement. Serving as Prime Minister of India since… pic.twitter.com/XLHXum9kG7— MyGovIndia (@mygovindia) December 19, 2025
దేశ-నిర్దిష్ట ర్యాంకింగ్ వినియోగదారులకు ఎంగేజ్ చేసిన టైం విండోలో అత్యధికంగా లైక్స్ సాధించిన ట్వీట్ల స్నాప్‌షాట్‌ను అందించడానికి ఎక్స్ ఈ ఫీచర్‌ను లాంచ్ చేసింది. అంతర్జాతీయ పర్యటనలు, దౌత్యపరమైన సంభాషణలు, పర్యనటల్లో కొన్ని ముఖ్యమైన అంశాలను షేర్ చేస్తూండటం మోదీని టాప్‌లో నిలబెట్టింది. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు భగవద్గీత రష్యన్ భాషా కాపీని మోదీ అందిస్తున్నట్లు చూపించిన పోస్ట్, ఈ నెలలో అత్యధికంగా ఇష్టపడిన ట్వీట్‌గా నిలిచింది. ఈ పోస్ట్‌లో, ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తిదాయక గ్రంథంగా గీతను ప్రధాని అభివర్ణించారు. మోదీ అధ్యక్షుడు పుతిన్ న్యూఢిల్లీకి వచ్చినప్పుటి ట్వీట్ రెండో స్థానంలో ఉంది. అయితే వీటిన నిర్దిష్టంగా మోదీ ట్వీట్లకు ఖచ్చితమైన లైక్ కౌంట్‌లు లేదా రీచ్ వంటి వివరణాత్మక కొలమానాలను ఈ ఫీచర్ వివరించలేదు.


