న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు వేడి చర్చలు, వాకౌట్లు, నిరసనల మధ్య సాగాయి. ఈ సమావేశాలు ముగింపును పురస్కరించుకొని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎంపీలకు తేనీటి విందు ఇచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ఈ టీ పార్టీకి ప్రతిపక్ష సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కాకుండా స్నేహపూర్వకంగా సాగిన సరదా ముచ్చట్లు నవ్వుల పువ్వులు పూయించాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత ప్రియాంక గాంధీ స్పీకర్ టీ పార్టీకి హాజరు కావడం విశేషంగా నిలిచింది.
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జర్మన్‌పర్యటనలో ఉన్న కారణంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తన పార్టీకి ప్రాతినిధ్యం వహించారు. సుమారు 20 నిమిషాలు పాటు జరిగిన ఈ సమావేశంలో స్పీకర్ బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పక్కన ఆమె ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా అలెర్జీలను నివారించడానికి తన నియోజకవర్గం వయనాడ్‌పై చర్చతోపాటు, ఇక్కడి మూలికను తీసుకుంటానని ప్రియాంక గాంధీ చెప్పారట. అలాగే ఇటీవల ఇథియోపియా, జోర్డాన్, ఒమన్ పర్యటన వివరాల గురించి అడగగా, బావుందని ప్రధాని బదులిచ్చారు. ఇంకా సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ధర్మేంద్ర యాదవ్, ఎన్‌సిపి (ఎస్పీ)కి చెందిన సుప్రియా సులే, సిపిఐ నేత డీరాజా కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్‌తో సహా కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు సభకు బాగా సిద్ధమైనందుకు ప్రధాని ప్రశంసించారు.
This is the difference - @priyankagandhi understands the need for some courtesy calls - here at the speakers’ tea pic.twitter.com/zpS5c7OzDq
— pallavi ghosh (@_pallavighosh) December 19, 2025
అంతేకాదు ఈ సమావేశాలను మరికొంతసేపు కొనసాగించచ్చు కదా యాదవ్ సూచించినపుడు, తన గొంతు నొప్పి రాకుండా సెషన్‌ను ఇక్కడితే ముగించా రంటూ ప్రధాని మోదీ సరదాగా బదులిచ్చినట్టు సమాచారం. మరోవైపు కొంతమంది ప్రతిపక్ష నాయకులు కొత్త పార్లమెంట్ భవనంలో ఎంపీల కోసం పాత భవనంలో ఉన్న విధంగా సెంట్రల్ హాల్‌ను చేర్చాలని ప్రధానిని కోరారు. ఇక్కడ ఎంపీలు, మాజీ ఎంపీలు తరచుగా చర్చల కోసం సమావేశ మవుతారు. అది పదవీ విరమణ తర్వాత కూడా,ఇంకా చాలా సేవ చేయాల్సి ఉందా అంటూ ప్రధాని సరదా సంభాషణ ఎంపీలలో నవ్వులు పూయించిందట
చదవండి: లివింగ్ రిలేషన్ షిప్ తప్పు కాదన్న హైకోర్టు : ఆ 12మందికి భారీ ఊరట
కాగా ప్రతీ పార్లమెంటు సెషన్ ముగిసిన తర్వాత స్పీకర్ టీ పార్టీ ఇవ్వడం ఆనావాయితీగా వస్తుంది. ఈ శీతాకాల సమావేశాల్లో స్పీకర్ న్యాయంగా వ్యవహరించినందున, ప్రతిపక్ష ఎంపీలందరూ టీ పార్టీకి హాజరు కావాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నిర్ణయించినట్టు సమాచారం. అయితే గతంలో రాహుల్ గాంధీతో పాటు, ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా గత టీ పార్టీని బహిష్కరించారు. ప్రతిపక్ష ఎంపీలను సభలో మాట్లాడటానికి స్పీకర్ అనుమతించడం లేదనేది ప్రధాన ఆరోపణగా వస్తోంది. దీనిపై ప్రధాని మోదీపై విమర్శలు వెల్లువెత్తాయి.
చదవండి: ఒమన్ పర్యటనలో ప్రధాని మోదీ ‘చెవి రింగు’ స్టోరీ ఏంటో తెలుసా?
బెట్టింగ్ యాప్స్ : యూట్యూబర్ హై-ఎండ్ స్పోర్ట్స్ కార్లు చూసి ఈడీ షాక్!


