బెంగళూరులో జరిగిన అనూహ్య సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లితో కలిసి ఆడుకుంటున్న పిల్లవాడిని ఒక వ్యక్తి అమాంతం తోసి వేసిన ఘటన నెట్టింట దిగ్భ్రాంతి రేపుతోంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో వైరల్‌గా మారింది.
డిసెంబర్ 14న ఆ బాలుడు నీవ్ జైన్ తన అమ్మమ్మ ఇంటి దగ్గర ఇతర పిల్లలతో ఆడుకుంటుండగా ఈ సంఘటన జరిగింది. త్యాగరాజనగర్ ప్రాంతంలోని ఒక వీధిలో ఐదేళ్ల బాలుడు తోటిపిల్లలతో ఆటుకుంటున్నాడు. తల్లి కూడా అక్కడే ఉంది. ఇంతలో వెనకనుంచి వ్యక్తి ఆ బాలుడిని గట్టిగా కాలితో తన్నాడు. ఊహించని పరిణామానికి బాలుడు బొక్కబోర్లా పడిపోయాడు.
A five-year-old boy was allegedly assaulted by a passerby in Bengaluru’s #Thyagarajanagar area, with CCTV footage capturing the incident. Police arrested the accused, who was later released on bail, and further investigation is underway. #Bengaluru #Banashankari pic.twitter.com/eWeZpN9nIC
— Madhuri Adnal (@madhuriadnal) December 19, 2025
ఈ సంఘటన సిసిటివిలో రికార్డైంది. బాలుడి తల్లి దీపిక జైన్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, నిందితుడిని అరెస్ట్ చేశారు. తరువాత బెయిల్‌పై విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.తదుపరి దర్యాప్తు జరుగుతోంది. తన కొడుకును "ఫుట్‌బాల్ లా" తన్నాడని, దీంతో కనుబొమ్మల వద్ద గాయం రక్త స్రావమైందని, కాళ్లు, చేతులకు కూడాగాయాలైనాయని తల్లి ఆరోపించింది. మరోవైపు నిందితుడిని అదే ప్రాంతానికి చెందిన రంజిత్‌గా గుర్తించారు. ఇతను మాజీ జిమ్ ట్రైనర్ కూడా అట. ఉద్యోగాన్ని వదిలేసినట్టు సమాచారం. నిందితుడు ఈ ప్రాంతంలో ప్రజలపై దాడి చేయడం, దుర్భాషలాడడం లాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటాడట.
ఇవీ చదవండి: ట్వీట్స్‌తో మోత మోగించిన ప్రధాని మోదీ
బెట్టింగ్ యాప్స్ : యూట్యూబర్ హై-ఎండ్ స్పోర్ట్స్ కార్లు చూసి ఈడీ షాక్!


