పట్నా: హిజాబ్ వివాదంలో చిక్కుకున్న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar)కు సంబంధించి ఒక బెదిరింపు వీడియో ఒకటి సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ సంఘటపై కాంగ్రెస్, ఆర్జేడీ తీవ్రంగా స్పందించాయి. నితీశ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా, నితీశ్ మానసిక స్థితిపై ఆర్జేడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే బిహార్ సీఎం వెంటనే ఆ మహిళకు బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాలి అని నటి జైరా వసీం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నితీష్ కుమార్‌కు పాకిస్తాన్‌కు చెందిన ఒక గ్యాంగ్‌స్టర్ ద్వారా సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది.
పాకిస్తాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ షాజాద్ భట్టి ఈ సంఘటనపై క్షమాపణ చెప్పాలని సీఎంను డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ముస్లిం మహిళతో నితీష్ ప్రవర్తించిన తీరును ప్రస్తావిస్తూ భట్టి సదరు మహిళకు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. బాధ్యతా యుతమైన పదవిలో ఉండి ఇలా ప్రవర్తించడం తగదని వ్యాఖ్యానించినట్టు సమాచారం.
ఈ వీడియోపై ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ, బిహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) వినయ్‌కుమార్ స్పందించారు. ఈ విషయాన్ని పరిశీలించమని పట్నా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను కోరినట్లు చెప్పారు. ఇంతకుమించి ప్రస్తుతానికి వివరాలేమీ లేవంటూ, తదుపరి వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు, ఈ వీడియోపై అధికారిక విచారణ అనంతరం, బెదిరింపులను పరిశీలిస్తామన్నారు.
VIDEO | Hijab incident: On a Pakistan-based gangster allegedly issuing video threat to Bihar CM Nitish Kumar, Bihar DGP Vinay Kumar says, "The social media post is being investigated at the level of the IG, Patna. As of now, no immediate details are available."
(Full video… pic.twitter.com/eQ4s3pOJ49— Press Trust of India (@PTI_News) December 17, 2025
;
కాగా పట్నాలో ఆయుష్ డాక్టర్లకు సర్టిఫికెట్ల ప్రదానం సందర్భంగా ఒక మహిళా డాక్టర్ హిజాబ్‌ను (Hijab) దించి మరీ ముఖాన్ని చూడటంపై దుమారం రేపింది.
ఇదీ చదవండి: మెస్సీకి అనంత్ అంబానీ సర్‌ప్రైజ్ గిఫ్ట్, ఖరీదెంతో తెలుసా?


