ఫుల్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ Goat ఇండియా టూర్' వార్తల్లో నిలుస్తోంది. స్టార్ ప్లేయర్ భారత గడ్డపై అడుగుపెట్టి ఏ నగరంలో పర్యటించినా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా మెస్సీ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ స్థాపించిన గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న రిలయన్స్ ఫౌండేషన్ వన్యప్రాణుల రక్షణ, పునరావాస మరియు పరిరక్షణ కేంద్రమైన వంతారను సందర్శించారు. సందర్భంగా ఆ బిలియనీర్ వ్యాపారవేత్త మెస్సీకి అత్యంత అరుదైన వాచ్‌ను బహుమతిగా ఇచ్చారనే ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
అర్జెంటీనా దిగ్గజం మెస్సీతో భేటీ సందర్భంగా ఆ స్టార్‌కు అత్యంత విలాసవంతమైన బహుమతి అందించారు అనంత అంబానీ .మెస్సీకి 1.2 మిలియన్ డాలర్ల విలువైన వాచ్‌ను బహుమతిగా ఇచ్చారు. దీని విలువ సుమారు రూ. 11 కోట్లు. వంతార సందర్శన కార్యక్రమం మధ్యలో అత్యంత అరుదైన రిచర్డ్ మిల్లే టైమ్‌పీస్‌ను ధరించి కనిపించడం విశేషంగా నిలిచింది. మెస్సీ వాచ్ లేకుండా వచ్చారని, ఆ తర్వాత రిచర్డ్ మిల్లే RM 003-V2 GMT టూర్‌బిల్లాన్ 'ఏషియా ఎడిషన్' ధరించి కనిపించాడు అంటున్నారు పరిశీలకులు.
స్పెషల్ ఎడిషన్‌గా వచ్చిన ఈ వాచ్‌లు ప్రపంచవ్యాప్తంగా కేవలం 12 మాత్రమే ఉన్నాయట. బ్లాక్ అండ్ వైట్ కార్బన్ కేస్ , స్కెలిటన్ డయల్ ఉన్న ఈ స్పెషల్ వాచ్ మెస్సీ, అనంత అంబానీ మధ్య ఉన్న సన్నిహిత బంధానికి ప్రతీకగా నిలిచింది. అంతేకాదు స్పెషల్ అకేషన్‌కు గుర్తుగా విలాసవంతమైన జీవనశైలికి , ఖరీదైన వాచీలు అంటే ఇష్టపడే అనంత్ వాచ్ రిచర్డ్ మిల్లే RM 056 సఫైర్ టూర్‌బిల్లాన్‌ను ధరించారు. దీని విలువ 5 మిలియన్ డాలర్లు అంటే సుమారు 45.59 కోట్ల రూపాయలు.

కాగా మెస్సీ వంతార సాంస్కృతిక, మానవతా భావాలను ప్రతిబింబంగా నిలిచింది. ఇక్కడ అనుసరించే సంప్రదాయాలకు అనుగుణంగా, సాంప్రదాయ హిందూ ఆచారాలలో పాల్గొని ఆశీర్వాదం తీసుకున్నాడు. మహా ఆరతిలో పాల్గొని అంబే మాత పూజ, గణేష్ పూజ, హనుమాన్ పూజ , శైవాభిషేకం లాంటి పూజలు, ప్రార్థనలు చేశాడు.

లియోనెల్ మెస్సీ గౌరవార్థం అనంత్ రాధిక అంబానీ ఇష్టమైన సింహం పిల్లకు 'లియోనెల్' అని పేరు పెట్టడం విశేషం. ఇక్కడి సింహాలు, చిరుతలు, పులులు, ఏనుగులు, అధునాతన పశువైద్య సంరక్షణలో అభివృద్ధి చెందుతున్న సరీసృపాలతో సంభాషించాడు మెస్సీ. ముఖ్యంగా బుజ్జి ఏనుగు మాణిక్‌లాల్‌తో ఆటపాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

GOAT టూర్ 2025లో భాగంగా లియోనెల్ మెస్సీ ఇండియాలో పలు నగరాల్లో పర్యటించాడు. శనివారం కోల్‌కతాలో అడుగుపెట్టి, అదే అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌ను సందర్శించాడు. ఆ మరుసటి రోజు ముంబై, వంతారా, సోమవారం ఢిల్లీ పర్యటనతో ఈ పర్యటన ముగిసింది. ఈ పర్యటన సందర్భంగా తనకు లభించిన అపారమైన ప్రేమకు లియోనెల్ మెస్సీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్‌స్టాలో ఒక నోట్ పోస్ట్ చేశాడు.


