కర్ణాటక: ప్రస్తుతం అన్నీ ఆన్‌లైన్ మయమైపోయాయి. ఆఖరికి పెళ్లిచూపులు, నిశ్చితార్థాలు కూడా. మాగడికి చెందిన యువకుడు కెనడాలో ఉంటాడు, అతనికి ఉడుపి యువతితో ఆన్‌లైన్‌లోనే నిశ్చితార్థం జరిగింది. వరుడు సుహాస్, వధువు మేఘన. ఉడుపిలోని ఒక కళ్యాణ మండపంలో అట్టహాసంగా జరిపించారు. ఉడుపిలో మధ్యాహ్నం 12 గంటలకు కార్యక్రమం జరిగితే, అప్పుడు కెనడాలో అర్ధరాత్రి సమయం అయ్యింది. పెద్ద పెద్ద స్క్రీన్‌లు ఏర్పాటు చేసి అతిథులు వీక్షించారు. సుహాస్‌కి సెలవులు దొరక్కపోవడంతో ఇలా కానిచ్చేశారు. జనవరి 7, 8 తేదీల్లో వీరి వివాహం జరగనుంది. పెళ్లి కూడా ఆన్‌లైన్‌లో జరిపిస్తారా? అని బంధువులు హాస్యమాడారు.






