కారులో షికారు.. ప్రపంచ దేశాలకు మోదీ సరికొత్త పాఠాలు | Modi Car Diplomacy, A New Approach To Strengthening Global Ties And Personal Bonds With World Leaders | Sakshi
Sakshi News home page

కారులో షికారు.. ప్రపంచ దేశాలకు మోదీ సరికొత్త పాఠాలు

Dec 17 2025 8:14 AM | Updated on Dec 17 2025 10:49 AM

Modis diplomacy: trust building through car rides with world leaders

ప్రపంచ రాజకీయ ముఖచిత్రంలో.. సాధారణంగా అధికారిక సమావేశాలు, ప్రోటోకాల్‌లు, భద్రతా ఏర్పాట్లకు ప్రధానంగా చోటు ఉంటుంది. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ అందుకు మించిన పనే చేస్తున్నారు. వివిధ దేశాల అధినేతలతో కారులో షికార్లు కొడుతూ.. సరికొత్త దౌత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మరి ఈ చర్యలు ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నాయో తెలుసా?.. 

భారత ప్రధాని నరేంద్ర మోదీ చేస్తోందిగానీ.. ఆయన పర్యటనల్లో కనిపిస్తోందిగానీ సాధారణ ప్రోటోకాల్‌కి మించే. అయితే.. వ్యక్తిగతంగా దేశాధినేతలతో కారులో ప్రయాణించడం ద్వారా ఆయన తన ఫ్రెండ్లీ నేచర్‌ను కనబరుస్తున్నారు. అదే సమయంలో ప్రపంచ నాయకులతో సంబంధాలను మరింత బలపరుచుకుంటూ ‘కార్‌ డిప్లమసీ’తో ప్రపంచ దేశాలకు సరికొత్త పాఠాలు నేర్పుతున్నారు.  

రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌, బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌.. తాజాగా ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్‌తో టయోటా ఫార్చ్యూనర్‌లో ప్రయాణం.. దానికంటే కొన్నిగంటల ముందు జోర్డాన్ క్రౌన్ ప్రిన్స్ అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా-II స్వయంగా డ్రైవ్ చేసిన కారులో ప్రయాణించడం.. ఇవన్నీ కేవలం ప్రోటోకాల్‌గా మాత్రమే కాదు, వ్యక్తిగత స్నేహానికి సంకేతాలు అనే చెప్పొచ్చు. 

 

మోదీ పంథా.. దేశాధినేతలతో వ్యక్తిగత సంబంధాలను బలపర్చుకునే వ్యూహం!. ప్రపంచ నాయకులు మోదీతో కారులో ప్రయాణించడం ద్వారా, ఆయనతో ఉన్న అనుబంధాన్ని ప్రజలకు, ప్రపంచానికి చూపిస్తున్నారు. స్నేహపూర్వక సంకేతంగా మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ వేదికపై తన ప్రత్యేకమైన శైలిని ప్రదర్శించే మార్గం కూడా ఎంచుకున్నట్లు స్పష్టగా తెలుస్తోంది. అయితే..

ప్రపంచ నాయకులు అప్పుడప్పుడు వ్యక్తిగత అనుబంధాన్ని చూపించడానికి కారులో ప్రయాణించిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు, కొన్ని దేశాధినేతలు ప్రత్యేక అతిథులను స్వయంగా డ్రైవ్ చేసి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి(మోదీ రష్యా పర్యటనలో పుతిన్‌ స్వయంగా వాహనం నడిపారు కూడా). కానీ దీనిని ఒక నిరంతర దౌత్య శైలిగా ఉపయోగించిన ఉదాహరణలు చాలా అరుదు. మోదీ దీన్ని సాఫ్ట్ పవర్ టూల్‌గా మార్చి.. వరుసగా పలు దేశాల్లో ప్రదర్శించడం వల్లే ఇది ప్రత్యేకంగా నిలుస్తోందనే చెప్పొచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement