ప్రధాని మోదీ జోర్దాన్ పర్యటన ముగించుకొని కొద్దిసేపటి క్రితం ఇథియోపియా చేరుకున్నారు. ఆ దేశ ప్రధాని అబియ్ అహ్మద్ అలీ ఎయిర్ పోర్టులో ప్రధానికి స్వాగతం పలికారు. ప్రధాని మూడుదేశాల పర్యటన నిమిత్తం సోమవారం జోర్దాన్ బయిలుదేరారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇథియోపియా చేరుకున్నారు. ఆదేశ ప్రధాని మోదీకి ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికిన అనంతరం ఇరు దేశాధినేతలు కాఫీ తాగారు. అనంతరం ఇథియోఫియా ప్రధాని అబియ్ అహ్మద్ మోదీ కారును స్వయంగా నడిపి నేషనల్ ప్యాలెస్‌కి వెళ్లారు. మార్గ మధ్యలో సైన్స్ మ్యూజియం, ఫ్రెండ్‌షిప్ పార్క్ మోదీకి చూపించారు. ఈ సందర్భంగా మోదీకి ఆ దేశంలోని భారతీయులు ఘనస్వాగతం పలికారు. తమ అభిమాన నాయకుడికి పుష్పాలు అందించారు. మోదీ రాక సందర్భంగా ఓ చిన్నారి భారత సాంస్కృతిక నృత్యంతో స్వాగతం పలికింది.
మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇథియోపియా వెళ్లడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ జోర్దాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటన నిమిత్తం సోమవారం బయిలుదేరారు. జోర్దాన్ పర్యటన ముగించుకొని అనంతరం ఇథియోపియా చేరుకున్నారు.


