breaking news
reaches
-
అందరికీ అందుబాటులో ఇసుక
సాక్షి, విజయవాడ: వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇసుక రీచ్‌లు అందుబాటులోకి వచ్చాయని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఈ నెల 21 వరకూ ఇసుక వారోత్సవాలు జరుపుతున్నామని చెప్పారు. ఇసుక కొరత తీర్చేందుకు ఇసుక రీచ్ లతో పాటు స్టాక్ డిపోలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. విజయవాడలోని భవానీపురం, షాదీఖానా, కానూరులో మూడు స్టాక్ డిపోలతో పాటు మచిలీపట్నం, మైలవరం, నూజివీడులో కూడా ఏర్పాటు చేశామన్నారు. ఆన్లైన్లో ఇసుకను అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రస్తుతం ఐదు ఇసుక రీచ్‌ల తో పాటు నాలుగు పట్టా భూములు అందుబాటులో ఉన్నాయన్నారు. మరో వారం రోజులలో ఐదు ఇసుక రీచ్‌లు, ఐదు పట్టా భూములు అందుబాటులో కి రానున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో ఇసుక రీచ్ లు , స్టాక్ పాయింట్లు, స్టాక్ యార్డులు మొత్తం 15 అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. -
ఇసుకోత్సవం!
కష్టకాలం దాటింది. ఇసుక కొరత తీరింది. రీచ్‌లలో తవ్వకాలు మొదలయ్యాయి. లబి్ధదారుల చెంతకు ఇసుక లారీలు కదిలాయి. ఆగిన భవన నిర్మాణాలు ఊపందుకున్నాయి. కారి్మకుల కళ్లలో ఆనందాలు నిండాయి. కృష్ణమ్మ తగ్గుముఖం పట్టగా.. అధికార యంత్రాంగం ఇసుక సరఫరాకు పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా ‘ఇసుక వారోత్సవాలు’ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా ఇసుకను అందించేందుకు సమాయత్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా అధికారులు ఇసుక కొరతను అధిగమించారు. రోజుకు 20 వేల టన్నుల ఇసుక అవసరాలు ఉండగా మంగళవారం ఒక్కరోజే 20,204 టన్నుల ఇసుకను వినియోగదారులకు సరఫరా చేశారు. జిల్లాలో కొత్తగా 9 రీచ్‌లను గుర్తించారు. మరో 125 పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్తగా బాపట్ల, వినుకొండ, పిడుగురాళ్ల, నరసరావుపేటలో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని 19 ఇసుక రీచ్‌లు, 5 పట్టా భూముల్లో 14.49 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతులు తీసుకున్నారు. మంగళవారం రీచ్‌ల నుంచి 11,600 టన్నుల ఇసుక తవ్వకాలు జరిపారు. రాజధాని ప్రాంతంలోని స్టాక్ పాయింట్లు, ఎన్సీసీ, ఎల్అండ్టీ వద్ద ఇసుల నిల్వల నుంచి కూడా వినియోగదారులకు ఇసుకను సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం మైనింగ్ శాఖ పరిధిలో తొమ్మిది కొత్త ఇసుకరీచ్‌లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో బాపట్లలో ఓలేరు రీచ్, భట్టిప్రోలు మండలంలో తూర్పుపాలెం, దుగ్గిరాల మండలంలో వీర్లపాలెం, పెదకొండూరులో నాలుగు రీచ్‌ల అనుమతులు కోసం ప్రభుత్వానికి నివేదిక పంపారు. సాక్షి, అమరావతి: జిల్లాలో ఇసుక కొరతను అధిగమించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పుష్కలమైన ఇసుక నిల్వలు ఉన్నాయని, వాటిని లబి్ధదారులకు అందిచే లక్ష్యంతో పని చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా రోజుకు 20వేల టన్నుల ఇసుక డిమాండ్ ఉండగా మంగళవారం 20,204 టన్నుల ఇసుకను వినియోగదారులకు సరఫరా చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇందులో ప్రధానంగా కొత్త రీచ్‌లను గుర్తించడం, పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు పరిశీలన అనుమతులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం మైనింగ్ శాఖ పరిధిలో తొమ్మిది కొత్త ఇసుకరీచ్‌లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో బాపట్లలో ఓలేరు రీచ్, భట్టిప్రోలు మండలంలో తూర్పుపాలెం, దుగ్గిరాల మండలంలో వీర్లపాలెం, పెదకొండూరుల నాలుగు ఇసుకరీచ్‌ల అనుమతులు కోసం మైనింగ్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ముమ్మర కసరత్తు.. జిల్లాలోని 19 ఇసుక రీచ్‌లు, 5 పట్టా భూముల్లో 14.49 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలు జరిపేందుకు అనుమతులు తీసుకున్నారు. ఇప్పటికే గాజులంక, బొమ్మువానిపాలెం, మున్నంగి, తాడేపల్లి, బత్తినపాడు (కృష్ణాజిల్లా), దిడుగు, కొంగంటివారిపాలెం, నవ్వులూరు, పెదకాకాని, చౌడవరంలో స్టాకు యార్డులు ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా కొత్తగా మరో నాలుగు స్టాకు యార్డులు బాపట్ల, వినుకొండ, పిడుగురాళ్ల, నరసరావుపేటలో ఏర్పాటు చేయనున్నారు. ఇసుక లభ్యతను మరింత పెంచేందుకు వీలుగా 125 పట్టాభూముల్లోనూ తవ్వకాలకు అనుమతులు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వారోత్సవాల్లో భాగంగా చేపట్టే చర్యలు.. కొత్త స్టాకుయార్డులు, ఇసుక డిపోల ఏర్పాటు ప్రధానంగా వేబ్రిడ్జిలు, లైంటింగ్, సీసీ కెమెరాలు, మౌలిక వసతుల కల్పన ప్రతి నియోజకవర్గంలో స్టాకుయార్డు, డిపోల వద్ద ఇసుక ధరలు తెలిపే విధంగా ప్రచారం రీచ్‌ల వద్ద టన్ను ఇసుక రూ.375గా ప్రభుత్వం ధరను నిర్ణయించింది. అయితే తాజాగా స్టాక్ యార్డుల వద్ద నుంచి ఇసుక రీచ్‌లు ఎంత దూరంలో ఉన్నాయో చూసి ధరను నిర్ణయించి, అక్కడ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. పారదర్శకంగా సరఫరా.. ఇసుక వినియోగదారులకు పారదర్శకంగా అందేలా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలను తీసుకొంటోంది. కృష్ణా నదికి వరద తగ్గుముఖం పట్టడంతో, రీచ్‌లలో వీలైనంత ఎక్కువగా తవ్వకాలు జరిపేందుకు కల్టెకర్ ఐ.శామ్యూల్‌ఆనంద్‌కుమార్ నేతృత్వంలో కసరత్తు చేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే ఇసుక రీచ్‌ల నుంచి 11,600 టన్నుల ఇసుక తవ్వకాలు నిర్వహించారు. రాజధాని ప్రాంతంలో స్టాకు ఉన్న, ఎన్సీసీ, ఎల్అండ్టీ వద్ద ఇసుల నిల్వల నుంచి ఇసుకను వినియోగదారులకు కేటాయిస్తున్నారు. ఇసుక అందుబాటులో ఉంది.. జిల్లాలో ఇసుక కొరతను అధిగమించాం. రోజుకు 20 వేల టన్నుల ఇసుక అవసరం కాగా, మంగళవారం 20,204 టన్నుల ఇసుకను సరఫరా చేశాం. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అన్ని చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తున్నాం. అవసరం లేకున్నా ఇసుకను కొనుగోలు చేసి వ్యాపారం చేసే దళారీలపై కఠినంగా వ్యవహరిస్తాం. ఇసుక రీచ్‌లు, స్టాకు పాయింట్ల వద్ద సిబ్బంది అవినీతికి పాల్పడితే శిక్ష తప్పదు. అక్కడ ప్రత్యేక నిఘా వ్యవస్థ పనిచేస్తోంది. –ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్, కలెక్టర్ చాలా సంతోషంగా ఉంది నేను చిన్న ఇంటిని నిర్మించుకుంటున్నాను. కొద్ది రోజుల కింద ఇసుక కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేశాను. అధికారులు బుధవారం మంగళగిరి పట్టణంలోని అమరావతి టౌన్íÙప్ వద్ద ఉన్న స్టాక్ పాయింట్ నుంచి నాకు తొమ్మిది టన్నుల ఇసుకను సరఫరా చేశారు. –వల్లంశెట్టి బాలచంద్ర. కంతేరు, తాడికొండ మండలం -
హైదరాబాద్ చేరుకున్న వెంకయ్య నాయుడు
-
ఇక పకడ్బందీగా రీచ్‌లు
భద్రాచలం: జిల్లాలోని ఇసుక రీచ్‌లను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ లోకేష్ కుమార్ ఆదేశించారు. మంగళవారం ఐటీడీఏ పీఓ చాంబర్లో టీఎస్ఎండీసీ, ఇరిగేషన్, మైనింగ్, అగ్రికల్చర్, గ్రౌండ్ వాటర్ అధికారులతో ఏర్పాటు చేసిన జిల్లాలోని ఇసుక రీచ్‌ల సమన్వయ కమిటీ సమావేశంలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..ఇసుక రీచ్‌లను ఇతర శాఖాధికారులతో ఏర్పాటు చేసిన టీమ్ తరచుగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ములకలపల్లి, ముదిగొండ, మధిర, బోనకల్లో అవకతవకలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, నివేదిక మేరకు నిలిపివేయాలని డ్వామా పీడీని ఆదేశించారు. వాజేడు మండలం మోడికుంట ప్రాజెక్ట్ వద్ద 20,280 క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలను టీఎస్‌ఎమ్‌డీసీ ద్వారా ఆ¯ŒSలై¯ŒSలో దరఖాస్తు చేసుకున్న వారికే విక్రయించాలని సూచించారు. కొత్తగా వచ్చిన కొండాయిగూడెం, వీరాపురం, భద్రాచలం, ఇసుక రీచ్‌ల ద్వారా 10.47 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తీసేందుకు టీఎస్ఎండీసీ నిర్వహించాలని తెలిపారు. 2013–14కు గాను సొసైటీల్లో క్యూబిక్ మీటర్‌కు రూ.40 చొప్పున ఆదాయం వచ్చిన నిధుల నుంచి పరిపాలన ఖర్చుల నిమిత్తం రూ. 3, సభ్యులకు బోనస్‌గా రూ. 37 లు పంపిణీ చేయాలన్నారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల కోసం వచ్చిన 49 దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ, టీఎస్ఎండీసీ డీఓ మల్లయ్య, డ్వామా పీడీ జగత్ కుమార్ రెడ్డి, మై¯Œ్స జేడీ నర్సింహారావు, మధుసూద¯ŒSరెడ్డి, ఇరిగేష¯ŒS ఎస్ఈ, అగ్రికల్చర్ ఏడీ, ఆర్టీఓ, గ్రౌండ్ వాటర్ డీడీ తదితరులు పాల్గొన్నారు. -
యువభేరి ప్రాంగణానికి చేరుకున్న వైఎస్ జగన్
-
రేణిగుంటలో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం
తిరుపతి: యువభేరి కార్యక్రమానికి బయల్దేరిన వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ నేతలు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, సంజీవయ్య, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వైఎస్ జగన్ నెల్లూరుకు బయలుదేరారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా నెల్లూరు వెళ్తున్న వైఎస్ జగన్‌ను.. బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహాస్తి, తొట్టంబేడు రైతులు కలిశారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కుంటుందని రైతులు ప్రతిపక్షనేత వద్ద తమ గోడు చెప్పుకున్నారు. రైతులకు ధైర్యంగా ఉండాలని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ నెల్లూరులో జరగనున్న ‘యువభేరి’ కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. -
కలెక్షన్స్ కొల్లగొడుతున్న సుకుమార్ ’కుమారి’
-
ఇంటికి చేరుకున్న అదితి మృతదేహం
-
తొమ్మిదో రోజుకు చేరిన పుష్కరాలు
-
మూడో రోజు కన్నుల పండువగా పుష్కరాలు
-
హైదరాబాద్ చేరుకున్న ఆయుష్ శర్మ
-
హైదరాబాద్ చేరుకున్న సానియా
-
రాజ్ భవన్‌కు చేరుకున్న ప్రముఖులు
-
రాజ్ భవన్ చేరుకున్న కేసీఆర్
-
సభా ప్రాంగణానికి చేరుకున్న భారతి,షర్మిల
-
దివంగత మహానేతకు నివాళులు