హైదరాబాద్ సాక్షి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు. మరికాసేపట్లో జరిగే బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాలపై న్యాయ పోరాటానికి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాకుండా రాబోయే కాలంలో పార్టీ అనుసరించాల్సిన విధానాలపై కార్యకర్తలకు మాజీ ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. కాగా బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొరకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీమంత్రి హరీశ్ రావు ఇదివరకే తెలంగాణ భవన్ చేరుకున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా పార్టీ కీలక నాయకులతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడున్నట్లు సమాచారం.


