గతంలో కేబినెట్ భేటీలకు గైర్హాజరు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్తారని సమాచారం
కానీ జ్వరంతో పవన్ పర్యటన రద్దు
సరిగ్గా పరీక్షలు ఉన్నప్పుడే బడీ దొంగ పిల్లాడికి జ్వరం వచ్చినట్లు, ఇంట్లో ఎక్కువ పని ఉన్నప్పుడే తోడికోడలు కడుపునొప్పి అంటూ పని ఎగ్గొట్టినట్లు.. పెద్ద మేనేజర్ తో మీటింగ్ ఉన్నరోజే తెలివైన చిన్న మేనేజర్ క్యాజువల్ లీవ్ పెట్టినట్లు. పవన్ కళ్యాణ్ కూడా సరిగ్గా సమయం చూసి టాలెంట్ చూపెడుతున్నారు. సమయం .. సందర్భం చూసి తనకు సమాధానం చెప్పే దమ్ము లేదని తెలుసుకుని ఆ ఎపిసోడ్ నుంచి తప్పుంచుకుని రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోతున్నారు.
గతంలో పలుమార్లు ఉద్దేశపూర్వకంగా ఏపీ కేబినెట్ సమావేశాలను ఎగ్గొట్టిన పవన్ కళ్యాణ్ ఆనాడు జరిగిన నిర్ణయాలు, భూ కేటాయింపులకు తానూ బాధ్యుడిని కాను అని లోకానికి చెప్పే అప్షన్ తనవద్ద ఉంచుకున్నారు. రేపు ఎప్పుడైనా ఈ భూకేటాయింపులు.. అస్తవ్యస్త నిర్ణయాలమీద ప్రజా వ్యతిరేకత మొదలైతే తనకు ఆ అంశంతో సంబంధం లేదని చెప్పుకునేందుకు స్విచ్ తనవద్దనే ఉంచుకున్నారు.
విశాఖ పెట్టుబడుల సదస్సుతోబాటు దావోస్‌కు సైతం పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. వేరే ఏదో కారణాలు చెప్పి అయన దూరంగా ఉంటున్నారు. దీంతో బాటు అసెంబ్లీ సమావేశాలకు సైతం తరచూ పవన్ డుమ్మాకొడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా ఆమధ్య టీడీపీ కార్యకర్తలు చిరంజీవిని సైతం ఒక అంశంలో దుమ్మెత్తి పోశారు..
చిరంజీవి ఇమేజిని దెబ్బతీస్తూ సోషల్ మీడియాలో పోస్టులమీద పోస్టులు పెట్టారు. ఆ సందర్భాల్లో కూడా పవన్ సైలెంట్ అయ్యారు.. పైగా జ్వరం అంటూ హైదరాబాద్ వెళ్లిపోయారు తప్ప ఈ అంశంలో ఎక్కడా ఒక్క మాట కూడా అనలేదు. టీడీపీ వారిని కంట్రోల్ చేయలేకపోయారా ? లోలోన వేరే ఏదో ఎజెండాతో సైలెంట్ అయ్యారా అనేది మాత్రం ఇప్పటికీ మిష్టరీగా ఉంది. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పవన్ శని ఆదివారాల్లో ప్రచారం చేస్తారని షెడ్యూల్ విడుదల చేసారు.
ఈమేరకు తెలంగాణాలో జనసేన అభిమానులు సైతం దీనికోసం ఏర్పాట్లు చేసారు. కానీ అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ జర్రమొచ్చింది అంటూ మంచమెక్కారు. ప్రచారం షెడ్యూలు రద్దు అంటూ సమాచారం వచ్చింది. తెలంగాణాలో బిజెపి.. జనసేన తరఫున అయన ప్రచారం చేస్తారని అన్నారు కానీ అయన తన నిర్ణయం మార్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా ఉన్నారన్న సమాచారం తెలంగాణ వ్యాప్తంగా పాకింది. పవన్ ఇమేజ్ సైతం బాగా తగ్గింది.. ఈనేపథ్యంలో అయన ప్రచారం చేసినా పెద్దగా ప్రయోజనం లేదని పార్టీ వర్గాలు భావించి ఇదే సమాచారాన్ని ఆయనకు చేరవేయగా ఓడిపోయేదానికి ప్రచారం ఎందుకులే అని ఆయనే జ్వరం పేరిట ప్రచారాన్ని ఎగ్గొట్టారని అంటున్నారు. మొత్తానికి మాంచి టైం చూసి పవన్‌కు జ్వరం వస్తుంది అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది
::సిమ్మాదిరప్పన్న


