ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్లు | Ambati Rambabu Quash Petition In Andhra Pradesh High Court | Sakshi
Sakshi News home page

ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్లు

Feb 6 2026 4:22 PM | Updated on Feb 6 2026 4:49 PM

Ambati Rambabu Quash Petition In Andhra Pradesh High Court

ఏపీ విజయవాడ: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి అంబటి రాంబాబు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. పట్టాభిపురం, నగరం పాలెం, మంగళగిరి, నల్లపాడు పోలీస్ స్టేషన్లలో తనపై అక్రమంగా కేసులు నమోదు చేశారని వాటిని క్వాష్ (కొట్టివేయాలని) చేయాలని కోరారు. ఇప్పటికే నల్లపాడు పీఎస్ కేసు క్వాష్ ఈ నెల 11కి వాయిదా పడింది. 

మంగళగిరిలో నమోదైన కేసులో 35 (3) BNSS ప్రొసీజర్ ఫాలో అవ్వాలని మంగళగిరి పోలీసులకు ఇవాళ ఏపీ హైకోర్టు ఆదేశాలు ఆదేశాలు జారీ చేసింది. అంబటిపై పిటి వారెంట్ కోసం మంగళగిరి కోర్టులో మంగళగిరి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరో ఐదు కేసుల్లో క్వాష్ పిటిషన్లు వచ్చే సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement