బాబూ.. లడ్డూపై ప్రశ్నిస్తే కోపమెందుకు?: అమర్నాథ్‌ | YSRCP Gudiwada Amarnath Satirical Comments On Chandrababu And Pawan Kalyan Over Their Conspiracy On Tirumala Laddu | Sakshi
Sakshi News home page

Gudiwada Amarnath: బాబూ.. లడ్డూపై ప్రశ్నిస్తే కోపమెందుకు?

Feb 6 2026 11:38 AM | Updated on Feb 6 2026 11:53 AM

YSRCP Gudiwada Amarnath Satirical Comments On CBN And pawan

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాపులంటే కక్ష అని ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. తిరుమలపై రాజకీయం చేస్తున్న చంద్రబాబు ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం కాపులను టార్గెట్‌ చేసింది. కాపులంటేనే చంద్రబాబు కక్ష సాధింపు. వంగవీటి రంగాను హత్య చేశారు. ముద్రగడను అనేక రకాలుగా వేధించారు. అంబటి మీద దాడి చేసి ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారు. ఎవరికి అన్యాయం జరిగినా వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. రేపు ఉదయం అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్నాం. దాడులు చేసిన వారిని వదిలేశారు. అంబటి రాంబాబుపై తప్పుడు కేసులు వ్యవహారంలో న్యాయ పరంగా పోరాటం చేస్తాము.

మేము చేసేది సంఘీభావ యాత్ర మాత్రమే.. రాజకీయ యాత్ర కాదు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ నివేదిక జంతు కొవ్వు కలవలేదని చెప్పిన తర్వాత కూడా మరొక కమిటీ ఎందుకు?. టీటీడీ లడ్డూలో జంతు కొవ్వు ఉందని చెప్పించడం కోసం చంద్రబాబు కమిటీ వేశారా?. వైఎస్సార్‌సీపీ మీద నెపం నెట్టడం కోసం మరొక కమిటీ వేస్తున్నారా. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు లేదని వచ్చిన నివేదికపై మీడియా అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుంది. గతంలో తాను నాస్తికుడుని అని ప్రకటించుకున్న నాగేంద్రబాబు నేడు సనాతన ధర్మం కోసం ఎలా మాట్లాడుతున్నారు. నాగబాబు పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో ఉంది. కల్తీ లడ్డుపై పవన్ కళ్యాణ్ స్టాండ్ ఎప్పటికప్పుడు మారిపోతుంది’ అని ఎద్దేవా చేశారు.

కరణం ధర్మ శ్రీ  మాట్లాడుతూ..‘కాపులను కూటమి ప్రభుత్వం వేధిస్తుంది. తప్పుడు కేసులు పెడుతోంది. అంబటి రాంబాబు కుటుంబానికి కాపులు అందరూ అండగా ఉంటారు. రేపు అంబటి రాంబాబు కుటుంబాన్ని ఉమ్మడి విశాఖ జిల్లా కాపు నేతలు అందరూ పరామర్శిస్తారు. రాంబాబుపై అక్రమంగా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారు. అంబటిని చంపేందుకు టీడీపీ గుండాలు ప్రయత్నం చేశారు. కాపు అనే వారికి అన్యాయం జరిగితే వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement