ఎట్టకేలకు దొరికిన పులి.. ఊపిరి పీల్చుకున్న ప్రజలు | The rescue teams captured the tiger | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు దొరికిన పులి.. ఊపిరి పీల్చుకున్న ప్రజలు

Feb 6 2026 7:21 PM | Updated on Feb 6 2026 7:48 PM

The rescue teams captured the tiger

సాక్షి,తూర్పు గోదావరి: జిల్లాలో గత కొద్దిరోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన పులి కథ ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. కూర్మాపురంలో మత్తు ఇంజక్షన్ ఇ‍చ్చి బెబ్బులిని బంధించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పులిని పట్టుకోవడానికిన పూణేకు చెందిన ప్రత్యేక బృందం రాష్ట్రానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.  ఐదు గంటల పాటు ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్  చేసి దానిని పట్టుకున్నారు. 

జిల్లాలో గత వారం రోజులుగా ఎక్కడ చూసిన పులి జాడ హాట్‌ టాపిగ్గా మారింది. రోజుకో,పూటకో రూటు మారుస్తూ అటవీ శాఖ అధికారులకు దొరకకుండా ముప్పుతిప్పలు పెట్టింది. ఆరురోజుల కిందట సీతానగరం మండలం తొర్రేడులో ఆవులపై దాడి చేసి చంపిన పులి రఘనాథపురంలో గేదేను బలికొంది. అనంతరం యర్రపాలెంలో మూడు లేగదూడలను చంపింది. దీంతో గ్రామస్థులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. పులి తమపై ఎక్కడ దాడి చేస్తుందా అని బిక్కుబిక్కుమంటూ గడిపారు. 

ఈ క్రమంలో పులిని పట్టుకునేందుకు నేషనల్ ఎక్స్‌ఫర్ట్‌ టీమ్‌ను తెప్పించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పులిని పట్టుకునేందుకు థర్మల్ డ్రోన్లు, ట్రాప్ కెమెరాలను సిద్ధం చేశామన్నారు. అయితే ఈ రోజు( శుక్రవారం) ఉదయం రాయవరం మండలంలోకి ప్రవేశించన పులి జి. ఎర్రపాలెం నుంచి చెల్లూరు మీదుగా కూర్మాపురం వెళ్లింది. తాజాగా అక్కడే రెస్క్యూ బృందాలు మత్తు ఇంజక్షన్ ఇచ్చి  పులిని బంధించారు. దీంతో జిల్లా హమ్మాయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement