వాళ్లు మెంటలోళ్లు..! | Kishan Reddy Serious On PM Modi and BJP MPs Meeting Leaks | Sakshi
Sakshi News home page

వాళ్లు మెంటలోళ్లు..!

Dec 17 2025 5:52 AM | Updated on Dec 17 2025 5:52 AM

Kishan Reddy Serious On PM Modi and BJP MPs Meeting Leaks

ప్రధానితో ఎంపీల మీటింగ్‌ వివరాలు లీక్‌ చేసిన వారిపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆగ్రహం

వాళ్లెవరో చెబితే చర్యలు తీసుకుంటాం

మీడియాతో చిట్‌చాట్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీతో చర్చించిన విషయాలు లీక్‌ కావడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తీ వ్రంగా మండిపడ్డారు. ఆ అంశాలు బయటకు చెప్పిన వాళ్లు మెంటలోళ్లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీలో తన నివాసంలో విలేకరులతో సమావేశం అనంతరం కిషన్‌రెడ్డి చిట్‌చాట్‌ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల పార్లమెంట్‌లో ప్రధాని తెలంగాణ బీజేపీ ఎంపీలతో జరిగిన సమావేశం, అక్కడ చర్చించిన అంశాలు బయటకు రావడం చర్చకు వచ్చింది. దీనిపై కిషన్‌రెడ్డి స్పందిస్తూ.. ‘అక్కడ జరిగింది వేరు.. మీడియాలో వచ్చింది వేరు.

పార్టీని, సోషల్‌ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేయడం తదితర అంశాలపై ప్రధాని పలు సూచనలు చేశారు. అక్కడ చర్చించిన విషయాలు బయటకు చెప్పొద్దని ప్రధాని స్వయంగా ఆదేశించారు. అయినా.. ఎవరో మెంటలోళ్లు అక్కడ జరిగింది వేరైతే మీకు చెప్పింది వేరు. వాళ్లెవరో చెబితే చర్యలు తీసుకుంటాం’ అని అసహనం వ్యక్తం చేశారు. 

ప్రతిపక్ష నేతగా రాహుల్‌ ఉండటం దురదృష్టకరం: మోదీపై ఏఐసీసీ అగ్రనేత రా హుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఢి ల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన ఓట్‌చో ర్‌–గద్దీ ఛోడ్‌ మహాధర్నాలో ప్రధానిపై రాహుల్‌ తీవ్ర వ్యా ఖ్యలు చేయడం సరికాదు. ప్రధాని స్థాయిని తగ్గించేలా రా హుల్‌ వ్యాఖ్యలున్నాయి. రాహుల్‌ లాంటి ప్రతిపక్ష నేత మన కు ఉండటం దురదృష్టకరం’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై చర్చించా...
‘తెలంగాణలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులపై మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సోమవారం చర్చించాను. 42 రైల్వేస్టేషన్ల పునర్నిర్మాణ పనులు వేగవంతం చేయడంపై చర్చించాం. రూ. 400కోట్లతో హైదరాబాద్‌ నుంచి యాదగి రిగుట్ట వరకు పొడిగించాల్సిన ఎంఎంటీఎస్‌ రెండో దశపైనా మాట్లాడాం. కొమురవెల్లి మల్లన్న రైల్వేస్టేషన్‌ నిర్మాణం పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని కోరాను’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement