న్యూఢిల్లీ: గోవా అగ్నిప్రమాదంలో 25 మంది మరణించిన కేసులో, ’బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్ సహ యజమానులైన గౌరవ్, సౌరభ్ లూథ్రా సోదరులను థాయ్‌లాండ్ అప్పగించిన అనంతరం మంగళవారం అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన గంటల వ్యవధిలో ఈ సోదరులిద్దరూ థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు పారిపోవడం తెలిసిందే. దీంతో అధికారులు ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసి, వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేశారు. డిసెంబర్ 11న, భారత ప్రభుత్వం అభ్యర్థన మేరకు థాయ్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇరు దేశాల మధ్య ఉన్న న్యాయ ఒప్పందాల కింద లూథ్రా సోదరులను బ్యాంకాక్ నుండి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించి, అధికారులకు అప్పగించారు. 44 ఏళ్ల గౌరవ్, 40 ఏళ్ల సౌరభ్‌లను పటియాలా హౌస్ కోర్టులో జ్యుడీíÙయల్ మేజిస్ట్రేట్ ట్వింకిల్ చావ్లా ముందు హాజరుపరచగా, గోవా పోలీసుల అభ్యర్థన మేరకు రెండు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ మంజూరైంది. నిందితులను బుధవారం ఉదయానికల్లా విమానంలో గోవాకు తీసుకురానున్నట్లు గోవా పోలీసు శాఖ ప్రతినిధి తెలిపారు.


