breaking news
nightclub fire
-
లూథ్రా సోదరుల అప్పగింత.. అరెస్ట్
న్యూఢిల్లీ: గోవా అగ్నిప్రమాదంలో 25 మంది మరణించిన కేసులో, ’బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్ సహ యజమానులైన గౌరవ్, సౌరభ్ లూథ్రా సోదరులను థాయ్‌లాండ్ అప్పగించిన అనంతరం మంగళవారం అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన గంటల వ్యవధిలో ఈ సోదరులిద్దరూ థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు పారిపోవడం తెలిసిందే. దీంతో అధికారులు ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసి, వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేశారు. డిసెంబర్ 11న, భారత ప్రభుత్వం అభ్యర్థన మేరకు థాయ్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.ఇరు దేశాల మధ్య ఉన్న న్యాయ ఒప్పందాల కింద లూథ్రా సోదరులను బ్యాంకాక్ నుండి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించి, అధికారులకు అప్పగించారు. 44 ఏళ్ల గౌరవ్, 40 ఏళ్ల సౌరభ్‌లను పటియాలా హౌస్ కోర్టులో జ్యుడీíÙయల్ మేజిస్ట్రేట్ ట్వింకిల్ చావ్లా ముందు హాజరుపరచగా, గోవా పోలీసుల అభ్యర్థన మేరకు రెండు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ మంజూరైంది. నిందితులను బుధవారం ఉదయానికల్లా విమానంలో గోవాకు తీసుకురానున్నట్లు గోవా పోలీసు శాఖ ప్రతినిధి తెలిపారు. -
నైట్‌క్లబ్‌లు.. ఆర్థిక చిక్కులు.. నిర్వహణ సవాళ్లు
గోవా నైట్‌క్లబ్‌లో ఇటీవల జరిగిన ఫైర్ యాక్సిడెంట్‌తో నైట్‌లైఫ్ ఇండస్ట్రీ నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, దాని ఆర్థిక వ్యవస్థలోని అంశాలు చర్చకు వస్తున్నాయి. మిరుమిట్లు గొలిపే లైట్లు, డీజే సంగీతం ఉండే నైట్‌క్లబ్‌ల్లో కోట్లాది రూపాయల బిజినెస్ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. భారతదేశంలో కూడా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, గోవా వంటి నగరాలు ఈ రాత్రిపూట వినోద రంగంలో ఏటా సుమారు 10% వృద్ధిని నమోదు చేస్తున్నాయి.నైట్‌క్లబ్ వ్యాపార నమూనానైట్క్లబ్లు ప్రధానంగా అధిక మార్జిన్ కలిగిన ఉత్పత్తులు, సర్వీసులను విక్రయించడం ద్వారా లాభాలను ఆర్జిస్తాయి. నైట్‌క్లబ్ ఆదాయంలో అత్యంత కీలకమైన భాగం ఆల్కహాల్, ఇతర పానీయాల విక్రయం. పానీయాలపై లాభాల మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. వీఐపీ టేబుల్స్ లేదా ప్రత్యేక విభాగాల్లో ‘బాటిల్ సర్వీస్’ ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. ఇందులో కస్టమర్లు అధిక ధరలకు ఖరీదైన మద్యం బాటిళ్లను కొనుగోలు చేస్తారు. దీనికి ప్రత్యేక సర్వీస్ అందిస్తుండడంతో నైట్‌క్లబ్‌లు ఆదాయం సంపాదిస్తాయి.ప్రవేశ రుసుము, కవర్ ఛార్జీలువారాంతాల్లో లేదా ప్రత్యేక ఈవెంట్ల సమయంలో కస్టమర్ల సంఖ్యను నియంత్రించడానికి, ఆదాయాన్ని పెంచడానికి ప్రవేశ రుసుము లేదా కవర్ ఛార్జ్ (దీనిలో కొంత మొత్తం పానీయాలకు లెక్కిస్తారు) వసూలు చేస్తారు.ప్రత్యేక ఈవెంట్లు, స్పాన్సర్షిప్లుప్రముఖ జాతీయ/ అంతర్జాతీయ డీజేలు, కళాకారులతో ఈవెంట్లను నిర్వహించడం ద్వారా టికెట్ ధరలను పెంచుతుంటారు. దీని ద్వారా పెద్ద సంఖ్యలో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు.కార్పొరేట్ ఈవెంట్లుప్రైవేట్ పార్టీలు, కార్పొరేట్ ఫంక్షన్లు, ప్రొడక్ట్ లాంచ్‌ల కోసం క్లబ్‌ను అద్దెకు ఇస్తుంటారు.బ్రాండ్ స్పాన్సర్షిప్లుమద్యం, సాఫ్ట్‌డ్రింక్స్ లేదా ఇతర లైఫ్‌స్టైల్ బ్రాండ్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది.నిర్వహణ, సవాళ్లునైట్క్లబ్ను విజయవంతంగా నడపడం కేవలం సంగీతం, డ్రింక్స్‌కు సంబంధించినది మాత్రమే కాదు. ఇది సంక్లిష్టమైన నిర్వహణ సవాళ్లతో కూడుకుంది. మద్యం లైసెన్స్, అగ్నిమాపక భద్రతా ధ్రువీకరణ, మ్యూజిక్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ వంటి అనేక రకాల అనుమతులను పొందాలి. వాటిని ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకోవాలి. గోవాలో జరిగిన సంఘటన వంటి వాటి నేపథ్యంలో నైట్క్లబ్ల భద్రతా ప్రమాణాల అమలుపై ప్రభుత్వాల నుంచి పర్యవేక్షణ, నియంత్రణ మరింత కఠినతరం కావాల్సి ఉంది.భద్రతా వాతావరణంనాణ్యమైన ధ్వని, లైటింగ్ సిస్టమ్, విభిన్న వాతావరణం (Ambiance), ప్రముఖ డీజేల ఎంపిక క్లబ్ పేరును, ప్రజాదరణను పెంచుతాయి. తాగుబోతుల నియంత్రణ, గొడవలు, ముఖ్యంగా మహిళా కస్టమర్ల భద్రత కోసం బలమైన భద్రతా సిబ్బంది అవసరం.ఖర్చుల నిర్వహణక్లబ్ల ఏర్పాటు కోసం స్థలం అద్దె, విద్యుత్, నీరు, బీమా వంటి స్థిర ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. క్లబ్లో స్టాక్‌ను నిర్వహించడం, దుర్వినియోగాన్ని అరికట్టడం, పానీయాల నాణ్యతను కాపాడటం లాభాలకు కీలకం. డీజేలు, బార్ అటెండర్లు, వెయిటర్లు, భద్రతా సిబ్బందికి అయ్యే వేతనాలుంటాయి.భద్రతా ప్రమాణాల ఉల్లంఘనల పర్యవసానంక్లబ్ల్లో కిటికీలు లేని చీకటి ప్రదేశాలు, ఇరుకైన మెట్లు, మూసివేసిన ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, అగ్నిమాపక పరికరాలు లేకపోవడం లేదా ఉన్నా పని చేయకపోవడం వంటివి ప్రమాద తీవ్రతను పెంచుతాయి. భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన క్లబ్ యజమానులు, నిర్వాహకులు భారీ జరిమానాలు, లైసెన్స్ రద్దు, క్రిమినల్ కేసులను ఎదుర్కోవలసి వస్తుంది. భద్రతా వైఫల్యాలు క్లబ్ బ్రాండ్‌కు, నైట్‌లైఫ్ పరిశ్రమ ప్రతిష్టకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.ఇప్పుడేం చేయాలంటే..భారతదేశంలో నైట్‌క్లబ్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగం. అయితే, ఇది నిలకడగా, సురక్షితంగా మనుగడ సాగించాలంటే కేవలం లాభాలపైనే కాకుండా.. భద్రతా ప్రమాణాలపై, చట్టపరమైన నిబంధనల అమలుపై నిర్వాహకులు, ప్రభుత్వాలు మరింత దృష్టి పెట్టాలి. గోవా సంఘటన లాంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే వ్యాపార లాభాలతో పాటు కస్టమర్ల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం తక్షణ అవసరం.ఇదీ చదవండి: ఇంకా సమసిపోని ఇండిగో సంక్షోభం -
లూథ్రా సోదరులకు చుక్కెదురు
పనాజీ/న్యూఢిల్లీ: గోవాలో 25 మందిని బలి తీసుకున్న అగ్ని ప్రమాదానికి కారణమైన నైట్‌క్లబ్ యజమానులు, సౌరభ్, గౌరవ్ లూథ్రాలకు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. థాయ్‌లాండ్‌కు చెక్కేసిన ఈ సోదరులకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు గట్టిగా నిరాకరించింది. మరోవైపు, ఈ కేసులో వారి వ్యాపార భాగస్వామి అజయ్ గుప్తాను అరెస్ట్ చేశారు. కోర్టులో లూథ్రా సోదరుల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... వారు పారిపోలేదని, ఒక వ్యాపార సమావేశం కోసమే విదేశాలకు వెళ్లారని తెలిపారు. ఆ క్లబ్‌కు వారు కేవలం లైసెన్స్ హోల్డర్లేనని, అసలు యజమానులు కారన్నారు. సౌరభ్ లూథ్రా ఏకంగా నాలుగు వారాల పాటు ట్రాన్సిట్ యాంటిసిపేటరీ బెయిల్ కావాలని కోరాడు. ‘నేను తిరిగి గోవాకు వస్తే, కోపంతో ఉన్న జనం నన్ను చంపేస్తారు, నా ప్రాణానికి ముప్పు ఉంది’.. అంటూ వాదించాడు. ‘నా మిగతా రెస్టారెంట్లు కూడా నేలమట్టం చేశారు. అధికారులు, చివరికి మీడియా కూడా నా రక్తం తాగడానికి కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు’.. అన్నాడు. అయితే, అడిషనల్ సెషన్స్ జడ్జ్ వందన మాత్రం ఆ వాదనలు తోసిపుచ్చి.. గోవా పోలీసుల స్పందన కోరుతూ కేసును గురువారానికి వాయిదా వేశారు. ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు లూథ్రా సోదరులు వేగంగా తప్పించుకోవడానికి సంబంధించి తాజాగా కొత్త వివరాలు బయటపడ్డాయి. ఇంటర్‌పోల్ వారి కోసం ’బ్లూ కార్నర్ నోటీసు’ కూడా జారీ చేసింది. డిసెంబర్ 7న తెల్లవారుజామున 1.17 గంటలకు, అగి్నప్రమాదం గురించి తెలిసిన గంటలోనే.. లూద్రా సోదరులు ట్రావెల్ పోర్టల్ ద్వారా థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామునే ఇండిగో విమానంలో దేశం దాటిపోయారు. అప్పటికి ఇంకా పోలీసులు మంటలు ఆర్పే పనిలోనే ఉండటం గమనార్హం. ఊచల వెనుక సైలెంట్ పార్ట్నర్ ‘బిర్చ్ బై రోమియో లేన్’నైట్‌క్లబ్‌లో తాను సైలెంట్ పార్టనర్, పెట్టుబడిదారుడినని చెప్పుకొంటున్న అజయ్ గుప్తాను.. గోవా పోలీసులు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సహాయంతో అరెస్ట్ చేశారు. అతనిపై కూడా లుక్ అవుట్ సర్క్యులర్ జారీ అయ్యింది. జమ్మూ వాసి అయిన గుప్తాను అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజి్రస్టేట్ వినోద్ జోషి ముందు హాజరుపరచగా, అతన్ని గోవాకు తరలించడానికి 36 గంటల ట్రాన్సిట్ రిమాండ్‌ను మంజూరు చేశారు. ఇండిగో విమానాలు రద్దు కావడం వల్ల ఏర్పడిన ప్రస్తుత విమాన ప్రయాణ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సుదీర్ఘ గడువు ఇచ్చారు. గుప్తా వెన్నెముక గాయంతో బాధపడుతున్నందున, తరలించేటప్పుడు.. అతనికి సరైన వైద్య సంరక్షణ అందించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఘటనలో ఇప్పటికే ఐదుగురు మేనేజర్లు, సిబ్బందిని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, పనాజీలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు ముందుగా భారీగా భద్రతా చర్యలు, తనిఖీలు చేపట్టాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆదేశించారు. ‘డిసెంబర్ 6 సంఘటన నేపథ్యంలో, ఉన్నతాధికారులు, పోలీసు, టూరిజం వాటాదార్లతో సమావేశమయ్యాను. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అగి్నమాపక భద్రతా ఆడిట్ కమిటీ ఇప్పటికే పర్యాటక సంస్థలను తనిఖీ చేయడం మొదలుపెట్టింది. వారు నివేదిక ఇచ్చాక, భద్రతా నిబంధనలు పాటించని సంస్థల లైసెన్స్‌లు రద్దు చేసి, భవనాలను సీల్ చేస్తాం’.. అని సీఎం స్పష్టం చేశారు. పర్యాటక రంగంలో ఉన్నవారు, తమ సిబ్బంది పర్యాటకులతో అనవసరమైన గొడవలకు దిగకుండా చూసుకోవాలని కూడా సావంత్ ఆదేశించారు. -
నైట్ క్లబ్లో కాల్పుల కలకలం...ప్రమాదవశాత్తు స్నేహితుడిని కాల్చిన వ్యక్తి
ఇటీవలకాలంలో క్లబ్లో కాల్పులు జరపడం సర్వసాధారణం అయిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా నైట్ క్లబ్‌లను తెల్లవార్లు తెరిచే ఉంచుతున్నారు కొంతమంది యజమానులు. అక్కడకు వచ్చిన కొంతమంది పీకలదాక తాగి ఆ మత్తులో చిన్న తగాదాకే ఒకరినొకరు చంపుకునేంత వరకు వెళ్లిపోతున్నారు. నిజానికి అక్కడ ఎలాంటి కారణం ఉండదు. ఆ మత్తులో తూలుతూ ఒళ్లుమరిచి ఇలాంటి దారుణాలకు తెగబడుతుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి కూడా అలాంటి దారుణానికే ఒడిగట్టాడు. వివరాల్లోకెళ్తే...హర్యానాలో నైట్ క్లబ్లో ఒక వ్యక్తి మహిళతో కలిసి పబ్ నుంచి బయటకు వచ్చాడు. వాళ్లతోపాటు మరికొంతమంది కూడా వస్తున్నారు. వారంతా కారు పార్కింగ్ వద్దకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏమైందో ఏమో ఇంతలో ఒక వ్యక్తి ఒక్కసారిగా జేబులోంచి పిస్టల్ తీసి అక్కడే ఉన్న క్లబ్ బౌన్సర్ల పై కాల్పులు జరపడం ప్రారంభించాడు. అంతే అతడు జరిపిన కాల్పుల్లో ప్రమాదవశాత్తు ఒక బుల్లెట్ అతని స్నేహితుడి శరీరంలోకి వెళ్లింది. దీంతో అతని స్నేహితుడి బాధతో విలవిలలాడుతూ కింద పడిపోయాడు. ఆ వ్యక్తి పక్కనే ఉన్న మహిళా స్నేహితురాలు నివారించేందుకు యత్నించినా ఆమె పై కూడా కాల్పులు జరిపాడు. దీంతో అక్కడే ఉన్న క్లబ్ బౌన్సర్లు అతన్ని అడ్డుకోవడమే కాకుండా అతని వద్ద ఉన్న పిస్టల్ని లాక్కున్నారు. ఐతే కాసేపటికి గాయపడిన వ్యక్తితో సహా నలుగురు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన మొత్తం సమీపంలో ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీంతో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజాము వరకు క్లబ్ తెరిచి ఉన్నందుకు యజమాని పైనా, కాల్పులకు పాల్పడిన వ్యక్తి పైనా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. #WATCH | Panchkula, Haryana| At around 4.30am accused open-fired outside Coco cafe in wee hours of July 3. He injured his friend & a bouncer. We've registered a case against accused & another against cafe for keeping it open till so late: PS sector 5 incharge Sukhbir Singh pic.twitter.com/C53n0uDE1p — ANI (@ANI) July 5, 2022 (చదవండి: రాహుల్ గాంధీ ఫేక్ వీడియో కేసులో న్యూస్ యాంకర్ అరెస్టు!) -
ప్రధాని పదవికే ఎసరు..!
బుకారెస్ట్: ఓ అగ్ని ప్రమాదం నేపథ్యంలో వెల్లువెత్తిన నిరసన ఆందోళన రొమేనియా దేశ ప్రధాని పదవికి ఎసరుపెట్టింది. రొమేనియాలోని బుకారెస్ట్‌లో గల ఓ నైట్‌క్లబ్‌లో పేలుడు, అగ్నిప్రమాదం సంభవించి దాదాపు 30 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో మిన్నంటిని నిరసనలకు ప్రతిఫలంగా ఆదేశ ప్రధాని 'విక్టోర్ పాంటా' రాజీనామా చేసే ఆలోచన చేస్తున్నట్లు సోషల్ డెమొక్రటిక్ నేత లియు డ్రాగ్నియా తెలిపారు. 'నా బాధ్యతలు ఎవరికైనా అప్పగించాలనుకుంటున్నాను. నేను రాజీనామా చేస్తున్నాను' అని పాంటా చెప్పినట్లు డ్రాగ్నియా చెప్పారు. బుకారెస్ట్ నైట్‌క్లబ్‌లో పేలుడు, అగ్నిప్రమాదం సంభవించి 33 మంది మరణించి, 180 మందికి పైగా గాయపడ్డారు. టపాసులతో కూడిన రాక్ సంగీత కచేరీ నిర్వహించిన సందర్భంగా ఈ ప్రమాదం జరిగినట్లు రొమేనియా ప్రభుత్వాధికారులు తెలిపారు. కానీ, క్లబ్ లోపల టపాసులు కాల్చేందుకు ప్రయత్నించడం వల్లే ఈ దారుణం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఘటనకు బాధ్యత వహించి వెంటనే ప్రధాని రాజీనామా చేయాలని, ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని మంగళవారం భారీ ఎత్తున ఆందోళన కారులు బుకారెస్ట్ వీధుల్లోకి వచ్చి ఆందోళన నిర్వహించారు. దాదాపు 20 వేల మంది ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కొంత హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఆ ఘటనకు బాధ్యత వహించి పార్టీ నేతలతో చర్చించిన తర్వాత ప్రధాని పదవికి పాంటా రాజీనామా చేస్తారని తెలుస్తోంది


