ప్రధాని పదవికే ఎసరు..! | Bucharest nightclub fire: Romanian prime minister to resign following protests | Sakshi
Sakshi News home page

ప్రధాని పదవికే ఎసరు..!

Nov 4 2015 3:13 PM | Updated on Sep 3 2017 12:00 PM

ప్రధాని పదవికే ఎసరు..!

ప్రధాని పదవికే ఎసరు..!

ఓ అగ్ని ప్రమాదం నేపథ్యంలో వెల్లువెత్తిన నిరసన ఆందోళన రొమేనియా దేశ ప్రధాని పదవికి ఎసరుపెట్టింది. రొమేనియాలోని బుకారెస్ట్‌లో గల ఓ నైట్‌క్లబ్‌లో పేలుడు, అగ్నిప్రమాదం సంభవించి దాదాపు 30 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో మిన్నంటిని నిరసనలకు ప్రతిఫలంగా ఆదేశ ప్రధాని 'పాంటా' రాజీనామా చేసే ఆలోచన చేస్తున్నట్లు సోషల్ డెమొక్రటిక్ నేత లియు డ్రాగ్నియా తెలిపారు.

బుకారెస్ట్: ఓ అగ్ని ప్రమాదం నేపథ్యంలో వెల్లువెత్తిన నిరసన ఆందోళన రొమేనియా దేశ ప్రధాని పదవికి ఎసరుపెట్టింది. రొమేనియాలోని బుకారెస్ట్‌లో గల ఓ నైట్‌క్లబ్‌లో పేలుడు, అగ్నిప్రమాదం సంభవించి దాదాపు 30 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో మిన్నంటిని నిరసనలకు ప్రతిఫలంగా ఆదేశ ప్రధాని 'విక్టోర్ పాంటా' రాజీనామా చేసే ఆలోచన చేస్తున్నట్లు సోషల్ డెమొక్రటిక్ నేత లియు డ్రాగ్నియా తెలిపారు. 'నా బాధ్యతలు ఎవరికైనా అప్పగించాలనుకుంటున్నాను. నేను రాజీనామా చేస్తున్నాను' అని పాంటా చెప్పినట్లు డ్రాగ్నియా చెప్పారు.

బుకారెస్ట్‌ నైట్‌క్లబ్‌లో పేలుడు, అగ్నిప్రమాదం సంభవించి 33 మంది మరణించి, 180 మందికి పైగా గాయపడ్డారు. టపాసులతో కూడిన రాక్ సంగీత కచేరీ నిర్వహించిన సందర్భంగా ఈ ప్రమాదం జరిగినట్లు రొమేనియా ప్రభుత్వాధికారులు తెలిపారు. కానీ, క్లబ్ లోపల టపాసులు కాల్చేందుకు ప్రయత్నించడం వల్లే ఈ దారుణం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఘటనకు బాధ్యత వహించి వెంటనే ప్రధాని రాజీనామా చేయాలని, ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని మంగళవారం భారీ ఎత్తున ఆందోళన కారులు బుకారెస్ట్ వీధుల్లోకి వచ్చి ఆందోళన నిర్వహించారు. దాదాపు 20 వేల మంది ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కొంత హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఆ ఘటనకు బాధ్యత వహించి పార్టీ నేతలతో చర్చించిన తర్వాత ప్రధాని పదవికి పాంటా రాజీనామా చేస్తారని తెలుస్తోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement