నైట్‌ క్లబ్‌లో కాల్పుల కలకలం...ప్రమాదవశాత్తు స్నేహితుడిని కాల్చిన వ్యక్తి

Man Fires At Bouncers At Haryana Club  Accidentally Injured His Friend   - Sakshi

ఇటీవలకాలంలో క్లబ్‌లో కాల్పులు జరపడం సర్వసాధారణం అయిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా నైట్‌ క్లబ్‌లను తెల్లవార్లు తెరిచే ఉంచుతున్నారు కొంతమంది యజమానులు. అక్కడకు వచ్చిన కొంతమంది పీకలదాక తాగి ఆ మత్తులో చిన్న తగాదాకే ఒకరినొకరు చంపుకునేంత వరకు వెళ్లిపోతున్నారు. నిజానికి అ‍క్కడ ఎలాంటి కారణం ఉండదు. ఆ మత్తులో తూలుతూ ఒళ్లుమరిచి ఇలాంటి దారుణాలకు తెగబడుతుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి కూడా అలాంటి దారుణానికే ఒడిగట్టాడు.

వివరాల్లోకెళ్తే...హర్యానాలో నైట్‌ క్లబ్‌లో ఒక వ్యక్తి మహిళతో కలిసి పబ్‌ నుంచి బయటకు వచ్చాడు. వాళ్లతోపాటు మరికొంతమంది కూడా వస్తున్నారు. వారంతా కారు పార్కింగ్‌ వద్దకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏమైందో ఏమో ఇంతలో ఒక వ్యక్తి ఒక్కసారిగా జేబులోంచి పిస్టల్‌ తీసి అక్కడే ఉన్న క్లబ్‌ బౌన్సర్‌ల పై కాల్పులు జరపడం ప్రారంభించాడు.

అంతే అతడు జరిపిన కాల్పుల్లో ప్రమాదవశాత్తు ఒక బుల్లెట్‌ అతని స్నేహితుడి శరీరంలోకి వెళ్లింది. దీంతో అతని స్నేహితుడి బాధతో విలవిలలాడుతూ కింద పడిపోయాడు. ఆ వ్యక్తి పక్కనే ఉ‍న్న మహిళా స్నేహితురాలు నివారించేందుకు యత్నించినా ఆమె పై కూడా కాల్పులు జరిపాడు. దీంతో అక్కడే ఉన్న క్లబ్‌ బౌన్సర్‌లు అతన్ని అడ్డుకోవడమే కాకుండా అతని వద్ద ఉ‍న్న పిస్టల్‌ని లాక్కున్నారు.

ఐతే కాసేపటికి గాయపడిన వ్యక్తితో సహా నలుగురు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన మొత్తం సమీపంలో ఉ​న్న సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీంతో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజాము వరకు క్లబ్‌ తెరిచి ఉ‍న్నందుకు యజమాని పైనా, కాల్పులకు పాల్పడిన వ్యక్తి పైనా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

(చదవండి: రాహుల్‌ గాంధీ ఫేక్‌ వీడియో కేసులో న్యూస్‌ యాంకర్‌ అరెస్టు!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top