170 కేజీల బరువు.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు | Haryana Faridabad 170kgs Man Collapsed During Gym Video Viral | Sakshi
Sakshi News home page

విషాద ఘటన: 170 కేజీల బరువు.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిపోయాడు

Jul 3 2025 10:49 AM | Updated on Jul 3 2025 11:05 AM

Haryana Faridabad 170kgs Man Collapsed During Gym Video Viral

బరువు తగ్గడానికి జిమ్‌కు వెళ్తున్నారా?.. అయితే ఈ వార్త తప్పకుండా చదవాల్సిందే. ఓ వ్యక్తి ఇలాగే జిమ్‌కు వెళ్లి వర్కవుట్స్‌ చేస్తూ కుప్పకూలి ప్రాణం పొగొట్టుకున్నాడు. గత నాలుగు నెలలుగా కచ్చితమైన డైట్‌ పాటిస్తూ.. ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ వహిస్తూ.. స్టెరాయిడ్స్‌, ప్రోటీన్‌ పౌడర్లకూ దూరంగా ఉంటున్నాడట. 

హర్యానా ఫరీదాబాద్‌లో మంగళవారం ఉదయం ఈ ఘటన చోట చేసుకుంది. నహర్‌ సింగ్‌ కాలనీకి చెందిన 37 ఏళ్ల పంకజ్‌ శర్మకు నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. రెండున్నరేళ్ల పాప కూడా ఉంది. తండ్రి కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో చేదోడు వాదోడుగా ఉంటున్నాడతను. అయితే  అతని బరువు 170 కేజీలకు చేరింది. దీంతో బరువు తగ్గించుకునేందుకు జిమ్‌ను ఆశ్రయించాడు. 

గత నాలుగు నెలలుగా ఫరీదాబాద్‌ సెక్టార్‌ 9లో ఉన్న జిమ్‌కు క్రమం తప్పకుండా వెళ్తున్నాడు. ఈ క్రమంలో.. జులై 1వ తేదీన స్నేహితుడు రోహిత్‌తో కలసి జిమ్‌కు వెళ్లాడు. బ్లాక్‌ కాఫీ తాగిన తర్వాత.. షోల్డర్ పుల్-అప్స్ చేయడం ప్రారంభించారు. మూడో పుల్-అప్ సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఆ శబ్దానికి జిమ్‌లో వాళ్లంతా పరిగెత్తుకొచ్చారు. అప్పటికే కాస్త స్పృహతో ఉన్న అతనికి నీటిని అందించడంతో.. వాంతులు చేసుకున్నాడు. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. 

దీంతో రెండుసార్లు సీపీఆర్‌ చేశారు. అయినా ఫలితం లేకపోయింది. సమీపంలోని ఆస్పత్రి నుంచి వైద్యులను రప్పించగా.. అప్పటికే అతని ఊపిరి ఆగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన వీడియో స్థానిక మీడియా ఛానెల్స్‌కు చేరింది. అధిక బరువు ఉన్నవారు లేదంటే ఆరోగ్య సమస్యలున్నవారు జిమ్ ప్రారంభించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఎక్సర్‌సైజులు చేసేప్పుడు ఈ కింది విషయాలు గుర్తుంచుకోండి
  • శరీర సామర్థ్యానికి మించి వ్యాయామాలు ప్రమాదకరం
  • స్టెరాయిడ్స్‌, సప్లిమెంట్స్‌లాంటి వాటిని వీలైనంత దూరంగా ఉండాలి 
  • హార్ట్‌బీట్‌, బీపీలను నిరంతరం చెక్‌ చేసుకుంటూ ఉండాలి
  • వ్యాయామాలకు ఉదయం సరైన సమయం
  • జిమ్‌ చేసే టైంలో.. గుండె వేగంగా కొట్టుకున్నట్లు(గుండె దడ) అనిపిస్తే వెంటనే ఆపేయాలి
  • అలసిపోయినప్పుడు, జ్వరం లేదంటే బలహీనంగా అనిపించినా జిమ్‌కు వెళ్లకూడదు
  • జిమ్‌ను కొత్తగా ప్రారంభించేవాళ్లు.. నిపుణుల సమక్షంలోనే మొదలుపెట్టడం ఉత్తమం
  • భారీ బరువులు ఎత్తే ముందుకు సరైన శిక్షణ తీసుకుని ఉండాలి.. లేకుంటే ఎత్తకూడదు
  • ట్రెడ్‌మిల్‌ పరిగెత్తడానికి పరిమితి ఉండాలి.. అదే పనిగా చేయకూడదు
  • ఎక్సర్‌సైజుల మధ్యలో కొంచెం కొంచెంగా నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement