గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం (Goa Nightclub Fire) తరువాత బ్యాంకాక్ పారిపోయిన ప్రధాన ప్రధాన నిందితులు క్లబ్ ఓనర్లు గౌరవ్ (Gaurav Luthra), సౌరభ్ లూత్రా (Saurabh Luthra) థాయిల్‌లాండ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని ఇండిగో విమానంలో (6E1064) తిరిగి తీసుకువస్తున్నారు. బ్యాంకాక్ విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 1:45 గంటలకు (IST) బయలుదేరాల్సి ఉంది. ఢిల్లీ చేరిన తరువాత వీరిని ఇద్దరినీ పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరుస్తారు, అధికారులు వారి ట్రాన్సిట్ రిమాండ్ కోరుతున్నారు. అనంతరం వీరిని గోవాకు తరలించాలని యోచిస్తున్నట్టు సమాచారం.
గోవాలోని 'బిర్చ్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 25 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. విషాదం జరిగిన కొన్ని గంటల తర్వాత థాయిలాండ్‌లోని ఫుకెట్‌కు పారిపోయారు. ఈ ఘటన తరువాత లూత్ర సోదరులపై నేరపూరిత హత్య మరియు నిర్లక్ష్యం కేసు నమోదైనాయి. వీరిని అరెస్ట్ చేసే క్రమంలోనే లూత్రా బ్రదర్స్ పాస్‌పోర్టులను కూడా అధికారులు రద్దు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు సిబ్బందినిఅరెస్టు చేశారు, వారిలో మేనేజర్ కూడా ఉన్నారు. క్లబ్ కు పర్మిట్లు, లైసెన్సులు జారీ చేయడంలో పాల్గొన్న అనేక ప్రభుత్వ విభాగాల అధికారులను కూడా విచారిస్తున్నారు. తాను "సైలెంట్ పార్టనర్" అని చెప్పుకున్నప్పటికీ, మూడవ భాగస్వామి అజయ్ గుప్తాను కూడా ఢిల్లీలో అరెస్టు చేశారు. డిసెంబర్ 9న థాయిలాండ్‌లోని తమ హోటల్ నుండి భోజనం కోసం బయటకు వచ్చిన తర్వాత ఇద్దరినీ థాయిలాండ్‌లో అదుపులోకి తీసుకున్నారు.


