చుట్టూ అగ్నికీలలున్నా బెదరలే, తెగువ చూపింది! | Filipino fur mum hailed as hero after tossing pet dogs to safe rescue | Sakshi
Sakshi News home page

చుట్టూ అగ్నికీలలున్నా బెదరలే, తెగువ చూపింది!

Dec 13 2025 7:24 PM | Updated on Dec 13 2025 7:58 PM

Filipino fur mum hailed as hero after tossing pet dogs to safe rescue

ఆపద సమయంలో చురుగ్గా స్పందించాలి. అది ఎంతటి ప్రమాదమైనా సరే.. గాభరా పడకుండా తప్పించుకునే మార్గాలున్నాయా అనేది ఆలోచించాలి. ఆందోళన పడితే బుర్ర పనిచేయదు.. ఏం చేయాలో తోచదు. ఉన్న అవకాశాన్ని  ఉపయోగించుకుని ధైర్యంగా అడుగుముందుకేయాలి. ఫిలిప్పీన్స్‌లోని సెబులోని మాండ్యూ నగరంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో  చిక్కుకున్న  ఒక మహిళ సరిగ్గా ఇలాగే చేసింది. తన పెంపుడు కుక్కల్ని కూడా కాపాడుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో  వైరల్‌గా మారింది.

ఫిలిప్పీన్స్‌లో ఇటీవల భారీ అగ్న ప్రమాదం చోటు చేసుకుంది. మహిళ నివసిస్తున్న భవనంలో మంటలు చుట్టుముట్టాయి. ఎటు చూసినా దట్టమైన, నల్లటి తీవ్రమైన పొగ వ్యాపించింది. తన రెండు పోమెరేనియన్లను కుక్కల్ని వదిలి వెళ్లడానికి మనసొప్పలేదు. అందు​కే అంత ఆపదలోనూ తెలివిగా, అంతకుమించిన మానవత్వంతో ఆలోచించిందా మహిళ. భవనంలో మంటలు చెల రేగుతున్న సమయంలో వాటిని మూడో అంతస్తులోని రైలింగ్‌పైకి విసిరి వాటిని కాపాడింది. ఆ తరువాత  అగ్నిమాపక సిబ్బంది వేసిన ల్యాడర్‌ ద్వారా చాలా జాగ్రత్తగా కిందికి  దిగింది. రెండు నిమిషాల వీడియో ఆన్‌లైన్‌లో ఆకర్షణీయంగా మారింది. దీంతో ఆమెను షీరో అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో ఏకంగా 30 లక్షలకుపైగా వ్యూస్‌ను సాధించడం విశేషం.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement