పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. ఇప్పుడు ఒక్క ఫోటో కారణంగా ట్రోలింగ్ బారిన పడ్డారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలిసు క్రమంలో ఒక్కరే కూర్చుని ఉన్న ఫోటో ఇప్పుడు ట్రెండింగ్,గా ఆపై ట్రోలింగ్‌గా మారిపోయింది. రష్యా అధ్యక్షుడి కోసం దాదాపు 40 నిమిషాల పాటు నిరీక్షించారు షెహబాజ్.
ఇది తుర్కిస్థాన్ దేశంలో చోటు చేసుకున్న ఘటన. ఆష్‌కాబాద్‌లో పాక్ ప్రధాని-రష్యా అధ్యక్షుడి సమావేశం జరగాల్సి ఉండగా అది కాస్త బాగా ఆలస్యమై పోయింది. మరి పుతిన్ కావాలనే వెయిట్ చేయించారో.. లేక ప్రత్యేక పరిస్థితల్లో ఆలస్యమైందో అనేది ఆయనకే తెలియాలి. అయితే గతంలో కూడా ట్రంప్.. పుతిన్‌కు ఫోన్ చేసిన సందర్భాల్లో కూడా ఆయన ఇలానే వ్యవహరించిన ఘటన గుర్తుకొస్తుంది.
నాలుగైదు నెలల క్రితం ట్రంప్ ఫోన్ చేసిన సమయంలో పుతిన్ అధ్యక్ష కార్యాలయంలో సిబ్బంది ఫోన్‌లోకి టచ్‌లోకి వచ్చేవారు. పుతిన్ ఏదో అత్యవసర సమావేశంలో ఉన్నారని వారు చెప్పేవారే కానీ, పుతిన్ ఆ ఫోన్‌ను తీసుకునేవారు కాదు. ఇదంతా పుతిన్ చర్యగానే అప్పట్లో వైరల్ అయ్యింది. ట్రంప్‌ను కావాలనే పుతిన్ వెయిట్ చేయించారనే వార్తలు వచ్చాయి. ఈ యాంగిల్‌లో చూస్తే పుతిన్ తాను పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలనే వ్యక్తులను వెయిట్ చేస్తారనే చెప్పక తప్పదు. మరి షెహబాజ్‌ను కూడా ఇలానే వెయిట్ చేయించారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనిపై కొంతమంది షెహబాజ్‌కు తిట్టిపోస్తున్నారు. అంతసేపు వెయిటింగ్ అవసరమా అంటూ పాకిస్తానీయులు ట్రోలింగ్ చేస్తున్నారు.
షెహబాజ్ గేట్ క్రాసింగ్..
షెహబాజ్ వెయింట్ అనేది విమర్శల బారిన పడితే, ఆయన గేట్ క్రాసింగ్ ఎపిసోడ్ మరింత చర్చకు దారి తీసింది. పుతిన్ ఎంతకూ రాకపోయేసరికి షెహబాజ్ నేరుగా పుతిన్ ఎక్కడైతే ఉన్నారో అక్కడకు వెళ్లిపోయారు. ఆ సమయంలోటర్కీ అధ్యక్షుడు ఎర్గోడన్‌తో సమావేశంలో ఉన్నారు. అయితే ఎదురుచూపులు చాలనుకున్న షెహబాజ్.. నేరుగా పుతిన్ ఉన్న దగ్గరకు వెళ్లిపోయారు. అలా వెళ్లి ఇలా వచ్చేసారు కూడా. అయితే అక్కడ ఏమైందనేది తెలియకపోయినా షెహబాజ్‌న వేచి ఉండండి అని పుతిన్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇది పాక్ ప్రధానికి జరిగిన అవమానమే అయినా ఎటువంటి అనుమతి లేకుండా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి షెహబాజ్ ఇలా చేశారు. ఇది గేట్ క్రాసింగ్ కిందుకు వస్తంది.
అసలు గేట్ క్రాసింగ్ అంటే ఏమిటి..?
అంతర్జాతీయ సంబంధాల్లో నాయకులు, ప్రతినిధులు కలిసే సమయంలో ప్రోటోకాల్ అనేది అనుసరించాల్సి ఉంటుంది. ఈ ప్రోటోకాల్‌లో ప్రవేశ క్రమం, గ్రీటింగ్ విధానం, సీటింగ్ ఆర్డర్, ఫ్లాగ్ ప్రదర్శన వంటి అంశాలు ఉంటాయి. ఒక నాయకుడు ఆతిథ్యుడు ముందుగా ఆహ్వానించకముందే గేట్ దాటి ముందుకు వెళ్లడాన్ని గేట్ క్రాసింగ్ అంటారు.. ఇది షెహబాజ్ ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకు వస్తుందని కొందరు అభిప్రాయపడుతుండగా, ఇది సాధారణ తప్పిదంగా మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా అంతర్జాతీయ అంశాలకు వచ్చేసరికి ఇవి చాలా ప్రాధన్యత సంతరించుకుంటాయి. ఆ క్రమంలోనే షెహబాజ్ గేట్ క్రాసింగ్ ఎపిసోడ్ వైరల్‌గా మారిపోయింది.
ఇలా జరగడం తొలిసారా?
ఇలా ఒక దేశ అధ్యక్షుడు వేరే వారితో సమావేశంలో ఉన్నప్పుడు మరో దేశ ప్రతినిధి.. ఇలా వెళ్లడం చాలా అరుద అనే చెప్పాలి. అంతర్జాతీయ సమావేశాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నప్పటికీ ఇలా గేట్ క్రాసింగ్ చేయడం అనేది తొలిసారిగా జరిగిన ఘటనగానే కొందరు పేర్కొంటున్నారు.. సాధారణంగా నాయకులు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం వచ్చిన తర్వాతే ప్రవేశిస్తారు. కానీ షెహబాజ్ షరీఫ్ పుతిన్–ఎర్డోగాన్ సమావేశం జరుగుతున్న గదిలోకి నేరుగా వెళ్లడం అంతర్జాతీయ స్థాయిలో మొదటి సారి పెద్దగా హైలైట్ అయిన ఘటన.గా మారింది,
కొసమెరుపు..
ఇది షెహబాజ్ తెలిసే చేసేరా.. లేక పొరపాటును ఓపిక నశించి ఇలా చేశారనేది ఆయనకే తెలియాలి.
ఇదీ చదవండి:
భారత్‌తో ట్రంప్ దాగుడు మూతలు..!


