కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రతిపాదనల విషయంలో అధ్యక్షుడు జెలెన్ స్కీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. యుద్ధం ముగింపునకు సంబంధించిన కొత్త శాంతి ప్రతిపాదనలను అమెరికాకు అందించేందుకు సిద్దంగా ఉన్నట్టు జెలెన్ స్కీ తాజాగా వెల్లడించారు. రెండు దేశాల మధ్య 20 పాయింట్ల ప్రణాళికకు చివరి మెరుగులు దిద్దుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తాజాగా వీడియోలో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగించే దిశగా 20 పాయింట్ల ప్రణాళికకు చివరి మెరుగులు దిద్దుతున్నామని, త్వరలోనే అమెరికాకు అందజేస్తామని తెలిపారు. యుద్ధం తర్వాత ఉక్రెయిన్ పునర్నిర్మాణం, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన విస్తృత ప్రణాళికపై ఇరు దేశాలు చర్చిస్తాయని అన్నారు. అయితే, గురువారం జరగనున్న 30 దేశాల నాయకుల వీడియో సమావేశానికి ముందు జెలెన్ స్కీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
మరోవైపు.. ఉక్రెయిన్‌లో అధ్యక్ష ఎన్నికల విషయమై జెలెన్ స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేశారు. అధ్యక్ష ఎన్నికలు జరగకుండా.. ఎన్నికలను ఆపేందుకు జెలెన్ స్కీ యుద్ధాన్ని సాకుగా వాడుకుంటున్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై జెలెన్ స్కీ స్పందిస్తూ.. మిత్ర దేశాలు తమ భద్రతకు హామీ ఇస్తే, రానున్న 60-90 రోజుల్లో ఉక్రెయిన్‌లో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో మార్షల్ లా అమల్లో ఉందని తెలిపారు. రష్యా దాడులు కొనసాగుతుండగా, ఎన్నికలు ఎలా నిర్వహిస్తాం? సైనికులు ఎలా ఓటు వేస్తారు? ఆక్రమిత ప్రాంతాల్లో ప్రజలు ఎలా పాల్గొంటారు? అనే ప్రశ్నలకు సమాధానం కావాలని ప్రశ్నించారు. రష్యా సుమారు 20 శాతం భూభాగాన్ని ఇప్పటికీ ఆక్రమించి ఉండటంతో ఎన్నికల నిర్వహణ పెద్ద సవాల్‌గా ఉందని స్ఫష్టం చేశారు.
The 20 points for ending the war form a fundamental document. We are actively working on the key steps – they must be doable. From this fundamental document, we are developing at least two additional ones. The first is on security – regarding security guarantees with the United… pic.twitter.com/uQVG4myA6Z
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) December 10, 2025


