అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి తన నోటికి పని చెప్పారు.పెన్సిల్వేనియాలో జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ, అకస్మాత్తుగా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అందాన్ని పొగడటం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సూపర్‌స్టార్ కరోలిన్ కూడా ఈ మీటింగ్‌కు వచ్చిందంటూ ఆమె వ్యక్తిగత సౌందర్యాన్ని, అందాన్ని ఆకాశానికెత్తేశారు. తన పరిపాలన ఆర్థిక విజయాలపై ప్రసంగాన్ని పక్కన పెట్టి మరీ అందమైన ముఖం, గన్నులాంటి పెదవులు చీప్ కామెంట్స్ చేయడం విస్తుగొల్పింది.
79 ఏళ్ల ట్రంప్ తనకంటే దాదాపు 50 ఏళ్లు చిన్నదైన 28 ఏళ్ల కరోలిన్ శారీరక సౌందర్యంపై వ్యాఖ్యలు చేశారు. ఆమె పెదవుల్ని ఏకంగా మెషీన్‌గన్‌తో పోల్చేశారు. ఆమె గొప్పది కాదా? కరోలిన్ గొప్పదా?" అని ఆయన ఉత్సాహంగా ఉన్న ప్రేక్షకులను అడిగారు. 28 ఏళ్ల ఎంత అందంగా ఉందో అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. తెలుసా, ఆమె టెలివిజన్‌లో, ఫాక్స్ వంటి టీవీ స్క్రీన్ పై ఆధిపత్యాన్ని చెలాయిస్తుందనీ, చిన్న మెషీన్‌గన్‌లాంటి పెదవులు, అందంతో కట్టి పడేస్తుందన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ వింతైన శబ్దాలను చేయడం సభికులను ఆశ్చర్యపరిచింది. కరోలిన్ నిర్భయంగా వాదిస్తుందని, ఎందుకంటే మన విధానాలను ఆమె సూటిగా చెప్పేస్తుందన్నారు. ఆగస్టులో న్యూస్‌మ్యాక్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా కరోలిన్ బ్యూటీపై దాదాపు ఇలాంటి కమెంట్స్ చేశారు.
కాగా డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నసమయంగా అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా 2019 నుంచి 2021 వరకు లివియట్ పనిచేశారు. న్యూహ్యాంప్‌షైర్‌కు చెందిన ఆమె రియల్ ఎస్టేట్ డెవలపర్ నికోలస్ రిక్కోను( 60) ను పెళ్లాడింది. ఎన్నికల్లో ఓడిన ఆమె మళ్లీ జనవరిలో వైట్‌హౌజ్‌లో ప్రెస్ కార్యదర్శిగా చేరింది.చరిత్రలో అతి పిన్న వయస్కురాలైన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ఆమె. ట్రంప్ ప్రెస్ సెక్రటరీగా పనిచేసిన ఐదో వ్యక్తి, రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టాక తొలి వ్యక్తి ఆమె.
ట్రంపు.. కంపు..
మరోవైపు ఆమె నైపుణ్యం, శక్తి సామర్థ్యాలపై కాకుండా, కేవలం అందంపై, ముఖ్యంగా పెదవులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు నెటిజన్లు. మహిళలపై ఇలాంటి సెక్సిస్ట్ కామెంట్లు చేయడం ట్రంప్‌నకు కొత్తేమీ కాదనీ, తన కంపు నోరును మరోసారి బయటపెట్టుకున్నాడని మండిపడుతున్నారు.


