లాహోర్: పాకిస్తాన్‌లోని ఓ సెషన్స్ కోర్టు జడ్జి ఛాంబర్ నుంచి రెండు యాపిల్స్‌తో పాటు ఒక హాండ్‌వాష్ బాటిల్ చోరీకి గురైన ఘటనపై కేసు నమోదైంది. దీనిపై పాకిస్తానీ పీనల్ కోడ్ సెక్షన్ 380 కింద కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే, దొంగకు కనీసంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండు పడే అవకాశా లున్నాయి.
ఈ నెల 5వ తేదీన జరిగిన చోరీపై అదనపు సెషన్స్ జడ్జి నూర్ ముహ మ్మద్ బసాŠమ్ల్ ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సిబ్బంది తెలిపారు. దొంగ ఎత్తుకుపోయిన రెండు యాపిల్స్, హ్యాండ్ వాష్ బాటిల్ మొత్తం విలువ వెయ్యి పాకిస్తానీ రూపాయలుగా పేర్కొంటూ పంజాబ్ ప్రావిన్స్‌లోని లాహోర్ నగర పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పాకిస్తాన్ చరిత్రలో అతిపెద్ద చోరీ కేసుగా పేర్కొంటూ దీనిపై హక్కుల కార్యకర్తలు జోకులు పేలుస్తున్నారు.


