1971 బంగ్లాదేశ్ స్వతంత్ర్య పోరాటంలో అమరులకు మద్ధతుగా బంగ్లాదేశ్ ఢాకా వర్సిటీలో విద్యార్థులు పెద్దఎత్తున ప్రదర్శనలు చేపట్టారు. పాకిస్థాన్‌తో పాటు ఆరోజు యుద్ధంలో బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా పోరాడిన రజాకార్ గ్రూపుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ స్వతంత్ర్య పోరాటంలో ప్రాణాలు వదిలిన వీరుల త్యాగాలకు గుర్తుగా ఈ ప్రదర్శనలు చేపడుతున్నట్లు విద్యార్థులు తెలిపారు.
బంగ్లాదేశ్ స్వతంత్ర్య పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలకు గుర్తుగా ఆదేశ విద్యార్థులు పెద్దఎత్తున సంఘీభావ కార్యక్రమం చేప్టటారు.ఆ రోజు జరిగిన పోరాటంలో ఎంతో మంది పాకిస్థాన్ కుట్రలకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 1971లో పాకిస్థాన్ ఆర్మీకి సహకరించడానికి రజాకార్ అనే మిలిషీయా గ్రూపును ఏర్పాటు చేశారని దాని ఆ మిలిటెంట్లు అంతర్గతంగా ఎంతో విధ్వంసం సృష్టించారని అన్నారు.
రజాకార్లు ప్రజలను చిత్రహింసలు పెట్టడంతో పాటు పెద్దఎత్తున ఇళ్లలో లూటీ చేశారని, సామూహికంగా చాలామందిని హత్యచేశారని స్వాతంత్ర్య సమరయోధులుగా నటిస్తూ తీవ్రఆగడాలకు పాల్పడ్డారని తెలిపారు. వీళ్లకు పాకిస్థాన్ ఆర్మీతో పాటు ఇతర ఉగ్రవాదులతో సంబంధాలు ఉండేయన్నారు. రజాకార్ల కుట్రలకు చాలా మంది స్వతంత్ర్య పోరాట యోధులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్ విమోచన పోరాటం 1971 మార్చి-డిసెంబర్ మధ్య జరిగింది. ఈ పోరాటానికి షేక్ ముజిబూర్ రహ్మాన్ నాయకత్వం వహించారు.ఈ యుద్ధంలో ఇండియా బంగ్లాకు అన్ని విధాలుగా సహాయం అందించింది. అంతేకాకుండా డిసెంబర్ 3న అధికారంగా రణ క్షేత్రంలో దిగి 13రోజుల్లో పాకిస్థాన్ ఆర్మీని ఓడించింది. దీంతో డిసెంబర్ 16న బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించింది.
బంగ్లాదేశ్ పితామహుడిగా పిలిచే షేక్ ముజిబుర్ రెహమాన్ అవామీ లీగ్ పార్టీ స్థాపకుడు, ఆదేశ మాజీ అధ్యక్షురాలు షేక్ హాసీనా ఆయన కుమార్తె. బంగ్లాదేశ్‌లో అల్లర్ల చెలరేగడంతో ప్రస్తుతం షేక్ హాసీనా భారత్‌లో భారత్‌లో తలదాచుకుంటుంది.


