పశ్చిమాసియాలో భీకర యుద్ధం.. ఇరాన్‌ సంచలన ప్రకటన | Iran sets three conditions for peace with the US and Israel | Sakshi
Sakshi News home page

పశ్చిమాసియాలో భీకర యుద్ధం.. ఇరాన్‌ సంచలన ప్రకటన

Mar 12 2026 10:07 AM | Updated on Mar 12 2026 11:37 AM

Iran sets three conditions for peace with the US and Israel

ఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ బీభత్సంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. యుద్ధాన్ని ముగింపు పలికేందుకు ఇరాన్‌ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో ఇరాన్‌ విధిస్తున్న షరతులకు ఇజ్రాయెల్‌,అమెరికా అంగీకరించాలని తెలిపారు. షరతులపై అమెరికా,ఇజ్రాయెల్‌తో సంప్రదింపులు జరిపేందుకు రష్యా,పాకిస్థాన్‌లు మధ్యవర్తిత్వం వహించాలని కోరారు. అంతేకాదు ఇరాన్‌ స్పష్టంగా ప్రకటించిన ఈ షరతులు నెరవేరితేనే యుద్ధానికి ముగింపు పలుకుతామని సూచించారు.  

అమెరికా-ఇజ్రాయెల్‌కు విధించిన షరతులు ఇవే

  •  మొదటి షరతుగా, ఇరాన్‌ హక్కులను అంతర్జాతీయంగా గుర్తించాలని టెహ్రాన్‌ డిమాండ్‌ చేసింది. తమ సార్వభౌమాధికారాన్ని అంగీకరించకపోతే శాంతి సాధ్యం కాదని స్పష్టం చేసింది. 

  • రెండవ షరతుగా, ఇప్పటి వరకు జరిగిన యుద్ధ దాడుల వల్ల కలిగిన నష్టాలకు అమెరికా, ఇజ్రాయెల్‌ పరిహారం చెల్లించాలని కోరింది.

  • మూడవ షరతుగా, భవిష్యత్తులో ఇరాన్‌పై దాడులు జరగవని హామీ ఇవ్వాలని స్పష్టంగా పేర్కొంది.

ఈ మూడు షరతులు నెరవేరితేనే యుద్ధానికి ముగింపు పలుకుతామని ఇరాన్‌ స్పష్టం చేసింది. లేకపోతే యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.  పశ్చిమాసియాలో అంతకంతకూ పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌ ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య మిసైల్‌ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్‌ షరతులు యుద్ధానికి ముగింపు దారితీస్తాయా లేదా అన్నది అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యుద్ధంపై మధ్యవర్తిత్వానికి కొన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇరాన్‌ స్పష్టమైన షరతులు పెట్టడం వల్ల ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో అనిశ్చితంగా ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement