భారత్ -ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక విజయం చోటుచేసుకుంది. ప్రపంచమంతా ఉద్రిక్తతలు నెలకొన్న వేళ మన దేశం రాజనీతితో తన పవర్ చూపింది. భారత జాతీయ పతాకం ఉన్న నౌకలను హర్మూజ్ జలసంధి మీదుగా అనుమతించడానికి ఇరాన్ పచ్చజెండా ఊపింది. కేవలం భారత్‌కు వెళ్లే నౌకలకు మాత్రమే ఎటువంటి షరతులు లేకుండా అనుమతిచ్చింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. చమురు రవాణాకు ఎంతో కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ఆయిల్ సరఫరా ఆగిపోయింది. దీంతో భారత్‌తో పాటు ఎన్నో దేశాలలో చమురు, వంటగ్యాస్ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో జరిపిన చర్చలు సత్ఫలితాలనిచ్చాయి.
భారత్‌కు చెందిన రెండు నౌకలు పుష్పక్, పరిమల్ అనే రెండు నౌకలు హార్మూజ్ జలసంధి మీదుగా సురక్షితంగా పయణమయ్యాయి. ఈ నౌకలలో ముడిచమురు, సహజవాయువు రవాణా అవుతున్నట్లు సమాచారం. రెండురోజుల క్రితం భారతీయ నావికుడు నడిపిన నౌకకు కూడా ఇరాన్ అనుమతిచ్చింది. అయితే అదే సమయంలో యుఎస్, ఇజ్రాయెల్, యూరఫ్ దేశాలకు చెందిన నౌకలకు హార్మూజ్ జలసంధి మీదుగా రవాణాకు అనుమతి నిరాకరించింది. దీంతో చమరు సంక్షోభం నెలకొంది.
హార్మూజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి ఏంతో కీలకం ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20శాతంతో పాటు గల్ఫ్ దేశాల నుంచి రవాణయ్యే చమురు ఈ మార్గం గుండానే వెళుతుంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ మార్గాన్ని ఇరాన్ బ్లాక్ చేసింది. ఒకవేళ షరతులు కాదని ఓడలు ముందుకు సాగితే వాటిని పేల్చేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఒక నౌకను పేల్చివేసింది.
అయితే నిన్న బుధవారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యా, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులతో పాటు యురోఫియన్ ఫారిన్ పాలసీ చీఫ్ ఖాజా కల్లాస్‌తో చర్చలు జరిపారు. ప్రస్తుతం నెలకొన్న యుద్దం వల్ల సంక్షోభ పరిస్థితులపై చర్చించారు.


