టెహ్రాన్: హర్మూజ్ జలసంధి పరిధిని దాటి దాడులకు ఇరాన్ సిద్ధమైంది. సముద్రంలో నౌకలనే లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ క్రమంలో నిన్న రాత్రి ఇరాక్ సమీపంలో ఉన్న అమెరికా ఆయిల్ ట్యాంకర్ నౌకను నేవల్ మైన్స్‌తో (సముద్రపు మందుపాతరలు) పేల్చివేసింది. అమెరికాకు చెందిన ‘సేఫ్ సీ విష్ణు’ అనే నౌకను పేల్చేసినట్లు ఐఆర్‌జీసీ ప్రకటించింది.
అయితే.. ఆ నౌకలో ఉన్న భారతీయ నావికుడు దుర్మరణం చెందినట్లు పాశ్చాత్య మీడియా ప్రకటించింది. మిగతా క్రూ మెంబర్స్‌ని కాపాడేందుకు అమెరికా, ఇతర దేశాల నౌకాదళాలు చర్యలు తీసుకుంటున్నాయి. కాగా.. ఇప్పటికే భారత్‌కు చెందిన ఓ నౌకపై హోర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ దాడి చేసిన విషయం తెలిసిందే..!
🚨 Indian Embassy in Iraq has confirmed that an attack on the crude oil tanker Safesea Vishnu near Basra on March 11 resulted in the tragic death of an Indian sailor.
15 other Indian crew members were safely evacuated & are receiving all possible assistance from the embassy. pic.twitter.com/vj0X5CbKYU— Megh Updates 🚨™ (@MeghUpdates) March 12, 2026


