మహిళల రక్షణకై ప్రపంచవ్యాప్తంగా ఎన్నిచట్టాలు తెచ్చినా పెద్దగా ఫలితాలు ఉండడం లేదు. అబలలపై ఆగడాలు నానాటికీ పెరుగుతూ పోతున్నాయి. మైనర్లపై జరుగుతున్న లైంగిక వేదింపులపై న్యూ లాన్సెంట్ చేపట్టిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం ఒక్క ఏడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా 100కోట్లకు పైగా మైనర్లు లైంగిక వేదింపులు ఎదుర్కొన్నట్లు సర్వేలో వెల్లడైంది.
అభం శుభం తెలియని వయసులో బాలికలు లైంగిక వేధింపులకు గురవడం తీవ్రంగా కలిచివేస్తుంది. మైనర్లపై లైంగిక వేధింపుల కట్టడికీ ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చిన పెద్దగా ఫలితం లేకుండా పోతుంది. మైనర్లపై దాడికి పాల్పడేవారిలో అధికశాతం వారికి తెలిసిన వారో లేదా బంధువులే కావడం చాలా బాధాకర విషయం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ది కలిగిన దిలాన్సెంట్ జర్నల్ నివేదికలో ఈవిషయాలే వెల్లడయ్యాయి. మైనర్లపై లైంగిక వేధింపులు నానాటికీ పెరుగుతున్నట్లు ది లాన్సెంట్ జర్నల్ నివేదికలో వెల్లడైంది.
2023 సంవత్సరాలనికి గానూ ప్రపంచవ్యాప్తంగా మహిళలపై వేధింపులు అనే అంశంలో దిలాన్సెంట్ సర్వే నిర్వహించింది. అందులో (బిలియన్) 100 కోట్లకు పైగా మహిళలు 15 లేదా అంతకంటే అధిక వయస్సులో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు తేలింది.వారిలో 68 లక్షలుపై పైగా వారి సన్నిహితుల నుండి వేధింపులు ఎదుర్కొన్నట్లు ప్రచురించింది. ఇండియాలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారిలో 15 సంవత్సరాల లోపు వారు 23 శాతం ఉండగా ఆ పైబడిన వారు దాదాపు 30 శాతంగా ఉన్నట్లు తెలిపింది. అంతే కాకుండా 15 సంవత్సరాల లోపు బాలురలో జరిగే లైంగిక వేధింపులలో భారత్ నుంచి 13 శాతం జరుగుతున్నట్లు పేర్కొంది.
ఈ లైంగిక వేధింపుల్లో అధికశాతం సబా- సహార ఆఫ్రికన్, సౌత్ ఆసియా ప్రాంతం నుంచే ఎదురవుతున్నట్లు నివేదిక తెలిపింది. ఈ వేధింపుల వల్ల హైచ్‌ఐవీ లాంటి ప్రమాదకర వైరస్ సోకడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని పేర్కొంది. గ్లోబన్ బర్డన్ డీసిజెస్‌లో ప్రచురించిన డేటా ఆదారంగా ది లాన్సెంట్ ఈ స్టడీ నివేదిక ప్రచురించింది.
2023 సంవత్సరంలో మహిళలపై జరిగిన హింసపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జరిపిన స్టడీలో భారత్‌లో 15-49 సంవత్సరాల వయస్సు గల మహిళలు అధికంగా లైంగిక వేధింపులు లేదా గృహహింస ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై గృహహింసపై జరుపుతున్న స్టడీలో భారత్ నుంచి 20శాతం ఉన్నట్లు ప్రచురించింది. వారిలో 30 శాతం మంది జీవిత కాలం గృహహింస ఎదుర్కొంటున్నట్లు నివేదిక పేర్కొంది.


