భారతదేశం అంతటా, అలాగే ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది జరుపుకునే దీపాల పండుగ 'దీపావళికి' అరుదైన గౌరవం లభించింది. ఈ దీపావళి పండుగను యునెస్కో(UNESCO) అవ్యక్త సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేరుస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఘనా, జార్జియా, కాంగో, ఇథియోపియా, ఈజిప్ట్ వంటి దేశాలలో సాంస్కృతికంగా జరుపుకునే వాటిలో ఈ పండుగకు చోటు కల్పించింది.
ఈ మేరకు ఢిల్లీలోని ఎర్రకోటలో భారతదేశం నిర్వహిస్తున్న అవ్యక్త సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ కోసం అంతర్-ప్రభుత్వ కమిటీ కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీపావళి పండుగను భారతదేశంలో అత్యంధికమంది జరుపుకునే పండుగలలో ఒకటి. ఇది చీకటిపై వెలుగు (అజ్ఞానంపై జ్ఞానం) సాధించిన విజయాన్ని సూచిస్తుంది.
🔴 BREAKING
New inscription on the #IntangibleHeritage List: Deepavali, #India🇮🇳.
Congratulations!https://t.co/xoL14QknFp #LivingHeritage pic.twitter.com/YUM7r6nUai— UNESCO 🏛️ #Education #Sciences #Culture 🇺🇳 (@UNESCO) December 10, 2025
యునెస్కో నిర్ణయాన్ని స్వాగతించిన భారత్..
ఈ ప్రకటనపై కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందిస్తూ.. నిజానికి ఈ నిర్ణయం భారతీయులకు ఎంతో లోతైన భావోద్వేగ విలువలతో ముడిపడి ఉన్న సంప్రదాయానికి దక్కిన అపురూపమైన గౌరవం. ఈ దీపావళి పండుగని తరతరాలుగా జరుపుకుంటున్నారని, జీవన వారసత్వానికి శక్తివంతమైన చిహ్నంగా కొనసాగుతోందని అన్నారు.
మాకు “ఈ యునెస్కో ట్యాగ్ కూడా ఒక బాధ్యత; దీపావళి జీవన వారసత్వంగానే ఉండేలా చూసుకోవాలి” అని షేకావత్ పేర్కొన్నారు. యునెస్కో చర్యపై నెట్టింట హర్షాతిరేకలు పెద్దఎత్తున వ్యక్తమవుతున్నాయి. దీన్ని చాలామంది చారిత్రాత్మక క్షణంగా అభివర్ణించారు. భారతదేశ సంస్కృతి, కాలాతీత సంప్రదాయానికి దక్కిన ప్రపంచ గుర్తింపు. నిజంగా ఇది భారతదేశానికి, ప్రపంచ సంస్కృతికి గర్వకారణమైన క్షణం.
భారతదేశ దీపాల పండుగును ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవాలి. అలాగే ప్రతి హృదయంలో శాంతిని ప్రకాశవంతంగా నెలకొల్పాలి. చివరగా ఇలా ప్రతిష్టాత్మకమైన జాబితా మా 'దీపావళి' పండుగను చేర్చినందుకు ధన్యవాదాలు, అలాగే భారతీయులందరికి అభినందనలు అంటూ పోస్టులు పెట్టారు నెటిజన్లు.
Unesco says Diwali is most asthetic festival in the world. Nothing comes close pic.twitter.com/A6sNlHJDaw
— Lala (@lala_the_don) December 10, 2025
(చదవండి: గుడి నిజమే కానీ.. పెళ్లిళ్లు మాత్రం చేయరు!)


