నైట్ క్లబ్ యజమానులు లూథ్రా సోదరులపై ఆరా
న్యూఢిల్లీ: అగ్ని ప్రమాదం సంభవించిన గోవాలోని ‘బిర్చ్ బై రోమియో లేట్’నైట్ క్లబ్ యజమానులు గౌరవ్ లూథ్రా, సౌర భ లూథ్రాల న్యూఢిల్లీ నివాసానికి పోలీసు బృందం సోమవారం చేరుకుంది. హడ్సన్ లే న్‌లోని వారి ఇంట్లో తనిఖీలు చేయగా లూథ్రా సోదరులు కనిపించలేదు. వారి ఆచూకీని తెలుసుకోవడానికి కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నించారు.
నైట్ క్లబ్ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించే భరత్ కోహ్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో గోవా పోలీసులు ఇప్పటివరకు క్లబ్ చీఫ్ జనరల్‌మేనేజర్ రాజీవ్ మోదక్, జనరల్ మేనేజర్ వివేక్ సింగ్, బార్ మేనేజర్ రాజీవ్ సింఘానియా, గేట్ మేనేజర్ రియాన్షు ఠాకూర్‌లను అరెస్టు చేశారు. క్లబ్ మేనేజర్‌ను విచారిస్తుండగా భరత్ కోహ్లీ ప్రస్తావన రావడంతో.. ఆయనను అరెస్టు చేశారు.


