గుడివాడ: నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుడివాడలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం(ఢిసెంబర్ 14వ తేదీ) ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సమీపంలోని ఇతర షాపులకు మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలంలో పొగలు దట్టంగా అలుముకున్నాయి. ప్రమాదం సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది నాలుగు ఫైరిజజన్ల సాయంతో అక్కడకు వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు.



