వాలంటీర్ హబీబ్‌ కుమార్తెకు వైఎస్‌ జగన్‌ రూ.2 లక్షల ఆర్థిక సాయం | Financial Aid from YS Jagan Cheque Handed Over to Habib’s Family | Sakshi
Sakshi News home page

వాలంటీర్ హబీబ్‌ కుమార్తెకు వైఎస్‌ జగన్‌ రూ.2 లక్షల ఆర్థిక సాయం

Mar 14 2026 5:07 PM | Updated on Mar 14 2026 5:25 PM

Financial Aid from YS Jagan Cheque Handed Over to Habib’s Family

సాక్షి, విశాఖ: వాలంటీర్ హబీబ్‌ కుమార్తెకు వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌​ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఆ చెక్కును హబీబ్ కుటుంబ సభ్యులకు వైసీపీ నేతలు కేకే రాజు, వాసుపల్లి గణేశ్‌ కుమార్ అందించారు. వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి గతంలో విశాఖకు వచ్చిన సందర్భంగా ఆయనను హబీబ్ కుటుంబ సభ్యులు కలిశారు.

అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెను ఆదుకోవాలని హబీబ్‌ విజ్ఞప్తి చేశారు. చిన్నారిని చూసి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి. గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తన కుమార్తెకు ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సాయం అందించారని హబీబ్‌ గుర్తు చేసుకున్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement