టాలీవుడ్ ప్రముఖ జంటల్లో వితికా శేరు- వరుణ్ సందేశ్ ఒకరు. 'పడ్డానండి ప్రేమలో మరి' అనే చిత్రంలో మొదలైన వీరిద్దరి జర్నీ పెళ్లి పీటలవరకు చేరుకుంది. ఈ సినిమాతోనే ప్రేమలో పడిన ఈ జంట కుటుంబాల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆగస్టు 19, 2016న వీరిద్దరు ఏడడుగులు వేశారు. అయితే ఈ జంట పెళ్లి తర్వాత బిగ్‌బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు. ఈ ఏడాది కొత్తింట్లో అడుగుపెట్టిన ఈ జంట సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్నారు.
తాజాగా ఈ జంట తమ ఎంగేజ్‌మెంట్ రోజులను గుర్తు చేసుకుంది. నిశ్చితార్థం జరిగి సరిగ్గా నేటికి పదేళ్లు పూర్తయిందని ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ పదేళ్ల మా ప్రేమలో అప్పటికీ.. ఇప్పటికీ ఏం మార్పు రాలేదని.. కేవలం మా వయస్సు సంఖ్య మాత్రమే పెరిగిందని పోస్ట్ చేశారు. మాకెలాంటి తొందర, గడువులు లేవు.. ఇప్పుడిప్పుడే మేమిద్దరం జీవితం గురించి నేర్చుకుంటున్నామని తెలిపారు. దశల వారీగా జీవితాన్ని నిర్మించుకుంటున్నామని సోషల్ మీడియా వేదికగా వితికా శేరు- వరుణ్ సందేశ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు మీరిద్దరు ఇలాగే నూరేళ్లు సంతోషంగా ఉండాలని శుభాకాంక్షలు చెబుతున్నారు.
కాగా.. ఈ ఏడాది వరుణ్ సందేశ్‌కు ఆయన సతీమణి వితికా శేరు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. వరుణ్ సందేశ్ పుట్టిన రోజున మరిచిపోలేని గిఫ్ట్‌ను ఇచ్చి ఆశ్చర్యానికి గురిచేసింది. భర్త వరుణ్ బర్త్‌డే సందర్భంగా కొత్త ఇంటిని బహుమతిగా ఇచ్చింది. ఈ విషయాన్ని వరుణ్ సందేశ్ స్వయంగా వెల్లడించారు. ఈ గుడ్ న్యూస్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. భార్యతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను షేర్ చేశారు.


