భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025లో భారత్ విజేతగా నిలవడం ఇందుకు ఓ కారణం అయితే.. అర్ధంతరంగా ఆమె పెళ్లి ఆగిపోవడం మరో కారణం.
సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ (Palash Mucchal)తో ప్రేమలో ఉన్నట్లు గతేడాది స్మృతి వెల్లడించింది. టీమ్ టూర్లకు సైతం అతడిని స్మృతి వెంట తీసుకువెళ్లేది. ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్ టోర్నీ ముగిసిన తర్వాత స్మృతి (Smriti Mandhana) ఇండోర్ (పలాష్ స్వస్థలం) కోడలు కాబోతోందంటూ పలాష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ..
అందుకు తగ్గట్లుగానే వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత.. తాము నిశ్చితార్థం (Engagement) చేసుకున్న విషయాన్ని ధ్రువీకరిస్తూ.. స్మృతి మంధాన తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ సహచర ఆటగాళ్లతో కలిసి వీడియో విడుదల చేసింది. అనంతరం పలాష్ సైతం స్మృతి వేలికి ఉంగరాన్ని తొడుగుతూ ఆమెకు ప్రపోజ్ చేసిన వీడియోను షేర్ చేశాడు.

ఘనంగా వేడుకలు
ఆ తర్వాత స్మృతి- పలాష్ హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. అయితే, మరికొన్ని గంటల్లో పెళ్లి ఉందనగా స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. దీంతో వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్మృతి మేనేజర్ వెల్లడించారు.
అకస్మాత్తుగా ఆగిన పెళ్లి.. అనుమానాలు
అయితే, ఆ తర్వాత పలాష్ ముచ్చల్ కూడా ఆస్పత్రిలో చేరడం.. అతడు తనతో అసభ్యకర రీతిలో చాట్ చేశాడంటూ ఓ అమ్మాయి స్క్రీన్‌షాట్లు షేర్ చేయడం అనుమానాలు రేకెత్తించాయి. ఈ క్రమంలో స్మృతిని పలాష్ మోసం చేశాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగగా.. ఇరు కుటుంబాలు మౌనం వహించాయి.
భిన్న స్పందనలు
ఈ క్రమంలో త్వరలోనే స్మృతితో తన కుమారుడి వివాహం జరుగనుందని పలాష్ తల్లి అమితా వెల్లడించగా.. స్మృతి సోదరుడు శ్రవణ్ మాత్రం పెళ్లికి సంబంధించిన తాము కొత్త తేదీ ఫిక్స్ చేయలేదని స్పష్టం చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో స్మృతి మంధాన శుక్రవారం తొలిసారిగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
రింగ్ తీసేసిన స్మృతి?
ఓ ప్రముఖ బ్రాండ్ కోసం చేసిన యాడ్‌లో స్మృతి.. తన వరల్డ్‌కప్ విన్నింగ్స్ మూమెంట్స్ గురించి మాట్లాడింది. ఇందులో స్మృతి వేలికి ఎంగేజ్‌మెంట్ రింగ్ కనిపించలేదు. దీంతో ఆమె నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుందని కొంతమంది నెటిజన్లు పేర్కొంటున్నారు.
అయితే, ఈ యాడ్ ఎంగేజ్‌మెంట్‌కు ముందే షూట్ చేశారని ఆమె అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. ఏదేమైనా స్మృతి ముఖం కళ తప్పినట్లు కనిపిస్తోందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా పెళ్లి వాయిదా పడిన వెంటనే స్మృతి.. తన వివాహ వేడుకలు, ఎంగేజ్‌మెంట్ రివీల్ వీడియోలను డిలీట్ చేయడం గమనార్హం.
చదవండి: ‘మా అన్నయ్య వల్లే ఇదంతా.. నా జీవితమే మారిపోయింది’


