భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదాకి సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది. వరుడు, స్వరకర్త పలాష్ ముచ్చల్ స్మృతిని మోసం చేసిన కారణంగానే అంగరంగ వైభవంగా జరగాల్సిన అర్థాంతరంగా వాయిదా పడిందన్నపుకార్లు జోరుగా వ్యాపించాయి. ధృవీకరించని చాట్‌లు వైరల్ అయ్యాయి. స్మృతి-పలాష్ పెళ్లి వాయిదాకు సంబంధించి స్పష్టమైన అధికారిక ప్రకటన ఏదీ రానప్పటికీ అనేక ఊహాగానాలు రోజుకొకటి వస్తూనే ఉంది. ఇన్ని పరిణామాల మద్య స్మృతి-పలాష్ ఇన్‌స్టా మార్పు అభిమానులు ఆశ్చర్యపరుస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పలాష్ ముచ్చల్ - స్మృతి మంధాన ఇద్దరూ దిష్టి ('blueye') ఎమోజీని చేర్చడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. స్మృతి , హల్ది ,మెహందీ వేడుకల ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించిన కొన్ని రోజులకే వారిద్దరూ ఇన్‌స్టా బయోకు ఒకే ఎమోజీని వాడటం సంచలనంగా మారింది.

స్మృతి-పలాష్ జంట నవంబర్ 23న వివాహం చేసుకోవాల్సి ఉంది. కానీ వారు అకస్మాత్తుగా వివాహాన్ని రద్దు చేసుకున్నారు. స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకే పెళ్లి వాయిదా పడిందని తొలుత వార్తలు వచ్చాయి. తరువాత, పెళ్లి ఎందుకు వాయిదా పడిందనే దానిపై సోషల్ మీడియాలో అనేక ఇతర వాదనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, స్మృతి మరియు పలాష్ ఇన్‌స్టాగ్రామ్‌లో గణనీయమైన మార్పు చేసి అభిమానులను ఆశ్చర్య పరిచారు. మరోవైపు ఇన్ని ఊహాగానాలు, పుకార్ల మధ్య ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరుగుతుందని పలాష్ ముచ్చల్ తల్లి అమిత ముచ్చల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది యాదృచ్చింగా జరిగిందా? ఇన్‌స్టాలో వీరిద్దరి లేటెస్ట్ అప్‌డేట్ ఏంటో అర్థం కాగా ఫ్యాన్స్ మాత్రం ఒక పక్క తెగ సంతోషపడుతూనే, మరో పక్క అయోమయంలో పడిపోయారు.


