ఏపీ పోలీసుల వేధింపుల పర్వం: బిహార్‌ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు | Bihar Govt Issues Key Orders After IPS Sunil Nayak Arrest Controversy, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఏపీ పోలీసుల వేధింపుల పర్వం: బిహార్‌ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

Feb 27 2026 10:02 PM | Updated on Mar 2 2026 4:53 PM

Bihar Govt Issues Key Orders After IPS Sunil Nayak Arrest Controversy

ఐపీఎస్‌ అధికారి సునీల్‌ నాయక్‌(ఫైల్‌ఫోటో)

ఢిల్లీ: బిహార్‌ రాష్ట్రంలో ఐపీఎస్‌గా విధుల నిర్వరిస్తున్న సునీల్‌ నాయక్‌పై ఏపీ పోలీసుల వేధింపుల నేపథ్యంలో బిహార్‌ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు అధికారులపై రాజకీయ వేధింపులకు చెక్‌ పెడుతూ బిహార్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారిక విధులు నిర్వరిస్తున్న సమయంలో నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటే తమ ప్రభుత్వం అనుమతి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది బిహార్‌ ప్రభుత్వం. 

బి ఎన్ ఎస్ ఎస్ సెక్షన్ 218 కింద బీహార్ పోలీసులకు రక్షణ కల్పిస్తూ  నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర సాయుధ దళాలకు రక్షణ తరహాలోనే బీహార్ పోలీసులకు  ప్రభుత్వ రక్షణ కల్పించనుంది. బిహార్‌ పోలీస్ అధికారి సునీల్ నాయక్ పై ఏపీ పోలీసుల దుందుడుకు చర్యలు నేపథ్యంలో  బీహార్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతీకార, రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదులతో అధికారులను వేధించకుండా నిరోధించేందుకు చర్యలు తీసుకుంది ప్రభుత్వం. కేసులను సమీక్షించిన తర్వాతే అనుమతి పై నిర్ణయం తీసుకునేలా నోటిఫికేషన్ జారీ చేసింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement