పెళ్లి పీటలపై యువతికి షాక్ | Ex lover shoots bride in Bihar | Sakshi
Sakshi News home page

పెళ్లి పీటలపై యువతికి షాక్

Feb 25 2026 3:44 PM | Updated on Feb 25 2026 5:09 PM

Ex lover shoots bride in Bihar

పాట్నా: ఆ వధువు మరికొద్దిసేపట్లో పెళ్లి చేసుకొని నూతన జీవితంలోకి అడుగుపెట్టబోతుంది. అయితే అంతలోనే ఊహించని ఘటన జరిగింది. పెళ్లి చేసుకొని నవ జీవితాన్ని ప్రారంభించాల్సిన వధువు పెళ్లి పీటలపైనే కాల్పులకు గురైంది. తనను ప్రేమించి వేరే వారిని పెళ్లి చేసుకుంటుందని కోపంతో పెళ్లికూతురి బాయ్‌ ఫ్రెండ్ ...వివాహ వేడుకలోనే ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో  ఆర్తీ అక్కడే  కుప్పకూలింది.

బిహార్ బక్సర్‌లోమంగళవారం ఉదయం  ఆర్తీ అనే 18 ఏళ్ల యువతికి చెందిన వివాహ వేడుక ఘనంగా జరుగుతుంది. వారి కుటుంబసభ్యులు, అతిథుల సమక్షంలో పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తన సోదరి పెళ్లికూతురుకు నుదుట సిందూరం పెడుతుంది. ఇంతలోనే ఊహించని విషాదం జరిగింది. బంధుమిత్రుల మధ్యలోనుంచి అకస్మాత్తుగా వచ్చిన యువకుడు ఆర్తీపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఆమె కడుపులోకి వెళ్లడంతో ఆమె పెద్దగా అరుస్తూ పెళ్లిమండపంలోనే కుప్పకూలింది.

దీంతో పెళ్లికూతురు బంధువులు హుటాహుటీన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం వారణాసిలోని ట్రామా సెంటర్‌కి తరలించారు. ప్రస్తుతం ఆర్తీ పరిస్థితి విషమంగా ఉందని తెలిస్తోంది. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి ఆర్తీకి పరిసర ప్రాంతంలోనే ఉండే వ్యక్తి దీనబంధుగా పోలీసులు గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. అయితే ప్రేమ వ్యవహారం కారణంగానే కాల్పులు జరిపి ఉండవచ్చని భావిస్తున్నారు. నిందితుడిపై గతంలోనూ పోలీసు కేసు నమోదైనట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement