జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సొరేన్ 19 ఏళ్ల మనవడు వీర్ సోరెన్ హఠాత్తుగా కన్నుమూశారు. ఫఙబ్రవరి 24, మంగళవారం, హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం మనాలిలో స్నేహితులతో ట్రిప్‌లో ఉండగా అనుమానాస్పదంగా మరణించడంతో విషాదం అలుముకుంది.
తన మనవడి విషాద వార్తనుస్వయంగా చంపాయ్ సోరెన్ ట్విటర్ ద్వారా ధృవీకరించారు.
వీర్ నిష్క్రమణతో, తమ కుటుంబం ఛిన్నాభిన్నమైందంటూ విచారం వ్యక్తంచేశారు.
अत्यंत दुःख के साथ सूचित करते हैं कि हमारे प्रिय पोते वीर सोरेन का 24 फरवरी 2026 को असामयिक निधन हो गया है।
हिमाचल प्रदेश के मनाली में अचानक तबियत बिगड़ने के बाद उन्हें अस्पताल ले जाया गया, लेकिन नियति को कुछ और ही मंजूर था।
वीर के जाने से हमारा परिवार बिखर गया है।
शोकाकुल,…— Champai Soren (@ChampaiSoren) February 25, 2026
పోలీసుల నివేదికల ప్రకారం సిమ్సా ప్రాంతంలోని హోమ్‌స్టేలో బస చేసింది. ఫిబ్రవరి 23న హమ్తా పాస్ సమీపంలోని సోలాంగ్ వ్యాలీ ,సేథాన్ గ్రామాన్ని సందర్శించి సాయంత్రంతిరిగి వచ్చారు. ఫిబ్రవరి 24 ఉదయం, తిరిగి బైటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, వీర్ తన గదిలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితులు మధ్యాహ్నం 12:30 గంటలకు తిరిగి వచ్చినప్పుడు, తలనొప్పిగా ఉందని చెప్పిన కొద్దిసేపటికే పరిస్థితి విషాదకరంగా మారింది. మంచం మీదనుంచి పడిపోయి, అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. నోటిలోంచి నురుగు కూడా వచ్చింది. వెంటనే మనాలిలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు CPR చేసి అత్యవసర వైద్య సహాయం అందించినప్పటికీ ఫలితం దక్కలేదు.

మరణానికి ఖచ్చితమైన కారణం ఏంటి అనే విషయం ఇంకా దర్యాప్తులో ఉన్నప్పటికీ, సీనియర్ పోలీసు అధికారులు హైపోక్సేమియా కారణంగా ఉండవచ్చని సూచించారు. హమ్తా పాస్ మార్గంలోని ఎత్తైన ప్రదేశాలకు వెల్లడం, పర్వత గాలికి అలవాటు పడని ప్రయాణికులలో తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు ,తలనొప్పి వస్తుంది అని చెబుతున్నారు.
ఇదీ చదవండి: ViRosh రెండు పద్ధతుల్లో వెడ్డింగ్, కాబోయే కోడలికి అత్తగారి అందమైన గిఫ్ట్


