ఢిల్లీ లిక్కర్‌ కేసు.. హైకోర్టులో సీబీఐ అప్పీల్‌ | CBI To Challenge Delhi Court Order Over Discharging Arvind Kejriwal And Manish Sisodia In Liquor Scam Policy Case | Sakshi
Sakshi News home page

ఢిల్లీ లిక్కర్‌ కేసు.. హైకోర్టులో సీబీఐ అప్పీల్‌

Feb 27 2026 5:59 PM | Updated on Feb 27 2026 6:22 PM

Cbi To Challenge Delhi Court Order Discharging Kejriwal And Sisodia

ఢిల్లీ: లిక్కర్‌ కేసులో ట్రయల్ కోర్టు తీర్పును సీబీఐ హైకోర్టులో సవాల్ చేసింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్, కవిత సహా 23 మంది నిందితులను ట్రయల్‌ కోర్టు డిశ్చార్జ్ చేసిన సంగతి తెలిసిందే. అభియోగాలకు తగిన ఆధారాలను సీబీఐ చూపకపోవడంతో నిందితులను స్పెషల్ కోర్టు జడ్జి జితేందర్ సింగ్ డిశ్చార్జ్ చేశారు. 

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించిన సంగతి తెలిసిందే.. ఎక్సైజ్ పాలసీలో ఎటువంటి కుట్ర లేదా నేరపూరిత ఉద్దేశ్యం లేదని రౌస్‌ రెవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. అవినీతి జరగలేదంటూ కేజ్రీవాల్‌తోపాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలనుకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. లిక్కర్ పాలసీ అవినీతి కేసులో కేజ్రీవాల్, మణీష్ సిసోడియా సహా 20 మంది నిందితులందరికీ కోర్టు శుక్రవారం విముక్తి కల్పించింది.

అలాగే సీబీఐ దర్యాప్తులో తీవ్ర లోపాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. వేలాది పేజీల చార్జ్‌షీట్‌లో అనేక అంశాలు సాక్ష్యాలు లేదా సాక్షుల వాంగ్మూలాలతో మద్దతు పొందలేదని పేర్కొంది. చార్జ్‌షీట్‌లో తప్పుదారి పట్టించే వ్యాఖ్యానాలు ఉన్నాయని కూడా న్యాయ మూర్తి గమనించారు. సిసోడియాపై ప్రాథమికంగా కేసు నిలబడేంత ఆధారాలు సీబీఐ సమర్పించలేక పోయిందని కోర్టు తెలిపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement