నిందితులకు మూడు రోజుల కస్టడీ  | Delhi court extends police custody of Youth Congress leaders | Sakshi
Sakshi News home page

నిందితులకు మూడు రోజుల కస్టడీ 

Feb 27 2026 3:50 AM | Updated on Feb 27 2026 3:50 AM

Delhi court extends police custody of Youth Congress leaders

‘చొక్కాలు విప్పేసి నిరసన’ కేసు..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌ సందర్భంగా నిరసన తెలిపిన యూత్‌ కాంగ్రెస్‌ నాయకులను ఢిల్లీలోని కోర్టు మూడు రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతించింది. ముగ్గురి కస్టడీని హిమాచల్‌ ప్రదేశ్‌ పోలీసులు అడ్డుకోగా, 24 గంటలపాటు చోటుచేసుకున్న నాటకీయ పరిణామా ల మధ్య వారిని ఢిల్లీ పోలీసులు దేశరాజధానికి తరలించారు. 

కోర్టు ట్రాన్సిట్‌ రిమాండ్‌కు అనుమతించినప్పటికీ హిమాచల్‌ పోలీసులు ఢిల్లీ పోలీసులను దాదాపు ఐదు గంటలపాటు దిగ్బంధించారు. ఎట్టకేలకు నిందితులతోపాటు వారు ఢిల్లీకి చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య గురువారం పోలీసులు ముగ్గురినీ చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ మృదుల్‌ గుప్తా ఎదుట హాజరు పరిచారు. విచారణ కోసం ఐదు రోజుల కస్టడీకి అనుమతించాలని కోరారు. నిందితుల్లో యూపీ వాసులైన సౌరభ్, అర్బాజ్‌ ఖాన్, మధ్యప్రదేశ్‌కు చెందిన సిద్ధార్థ అవధూత్‌లు అరెస్ట్‌ల నుంచి తప్పించుకునేందుకు హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఓ రిసార్టులో దాక్కున్నారని పోలీసుల తరఫు లాయర్‌ తెలిపారు.

 బుధవారం ఉదయం 6.40 గంటల వేళ వారిని అదుపులోకి తీసుకుని, అదే రోజు మధ్యా హ్నం 1.40కి సిమ్లాలో మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చి, ట్రాన్సిట్‌ రిమాండ్‌కు కోరామన్నారు. అనుమతించిన కోర్టు.. వారిని 18 గంటల్లోగా సంబంధిత కోర్టులో హాజరుపర్చాలని షరతు పెట్టిందని వివరించారు. ఇంపాక్ట్‌ సమిట్‌ వద్ద నిరసన తెలిపేందుకు వాడిన టీషర్ట్‌ను సిద్ధార్థ్‌ డిజైన్‌ చేయగా, సౌరభ్‌ నిరసనకు పిలుపునిచ్చే వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేశాడని, సౌరభ్, అర్భాజ్‌లు నిరసనలో పాల్గొన్నారని లాయర్‌ పేర్కొన్నారు. 

నిరసన కోసం లక్షకు పైగా టీషర్టులను ప్రింట్‌ చేశారని, వీటిని ఎక్కడ ప్రింట్‌ చేశారు? దీని వెనుక ఎవరెవరున్నారో తెల్సుకునే ప్రయత్నా ల్లో ఉన్నామన్నారు. అయితే, నిరసన తెలిపారనే సాకుతో ఢిల్లీ పోలీసులు వారిని వెంటాడి పట్టుకున్నారని, ఇదంతా రాజకీయ పేర్రేపితమని నిందితుల తరఫు లాయర్‌ వాదించారు. వాదనలు విన్న మేజి్రస్టేట్‌ నిందితుల ను మూడు రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతిస్తున్నట్లు తెలిపారు. మార్చి ఒకటో తేదీన తిరిగి వారిని తమ ఎదుట హాజరుపర్చాలని కోరారు. వీరితోపాటు ఈ కేసులో అంతకుముందే అరెస్ట్‌ చేసిన అజయ్‌ కుమార్, రాజా గుజార్‌ అనే వారి రిమాండ్‌ గడువు ముగియడంతో వారిని కూడా పోలీసులు కోర్టుకు తీసుకువచ్చారు. దీంతో, వారి రిమాండ్‌ను మరో మూడు రోజులకు పొడిగిస్తున్నట్లు మేజి్రస్టేట్‌ తెలిపారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement