కుంటి సాకులు చెప్పి పారిపోకండి: పొంగులేటి | Ponguleti Srinivas Reddy Comments On BRS Leaders | Sakshi
Sakshi News home page

కుంటి సాకులు చెప్పి పారిపోకండి: పొంగులేటి

Feb 26 2026 5:50 PM | Updated on Feb 26 2026 5:59 PM

Ponguleti Srinivas Reddy Comments On BRS Leaders

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ ఒళ్ళంతా విషంతో విమర్శలు చేస్తోందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగే ప్రతీ ఎన్నికకు కాంగ్రెస్‌కు మైలేజ్ పెరుగుతుందన్నారు. బావ బామ్మర్థులు ఒంటి నిండా విషం నింపుకుని మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఆనాడు వైఎస్సార్‌ రాష్ట్రం అంతటా పాదయాత్ర చేసి.. ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రాజెక్ట్‌లను తీసుకొచ్చారని పొంగులేటి గుర్తు చేశారు.

‘‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. రాచరికంతో, జేబులు నింపుకొవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది. 38 వేల కోట్ల పాలమూరు ప్రాజెక్టును.. 1లక్ష కోట్లతో కాళేశ్వరం నిర్మాణం జరిపారు. 8వ అద్భుతం అంటూ ఆర్భాటం చేసి ప్రారంభించిన కొద్ది రోజులకే మేడిగడ్డ కూలింది. కాళేశ్వరం అవినీతిపై సీబీఐకి ఇచ్చినా ముందుకు వెళ్లడం లేదు. కమిషన్లు ఎక్కడ ఎక్కువ వస్తాయో అలాంటి ప్రాజెక్టులను గత ప్రభుత్వ పెద్దలు టేకప్ చేశారు.

‘‘రాష్ట్ర ప్రయోజనాల ఒక్క నీటి చుక్కను వదులుకోమంటూ సీఎం, ఉత్తమ్ చెప్తూనే ఉన్నారు. శవాల మీద చిల్లర వేరుకునే ఆలోచనతో బావ బామ్మర్థి ప్రవర్తన ఉంది. వారు పేడ్ ఆర్టిస్టులతో ఆరోపణలు చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ లో చర్చ పెడదాం.. కుంటి సాకులు చెప్పి పారిపోకండి. విషం చిమ్మడం మానేయండి.. ప్రజల కోసం ప్రభుత్వానికి మంచి సూచనలు ఇవ్వండి’’ అంటూ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement